‘భవదీయుడు భగత్ సింగ్’.. దసరా నుంచి సెట్స్ పైకి?

Sep 28 2021 @ 11:40AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకి టైటిల్  అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ కు అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయం తర్వాత పవన్, హరీష్ కలయికలో రెండో సినిమా కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. దాంతో ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి మొదలైంది. 

అయితే ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ షూటింగ్ సరిగ్గా దసరా నుంచి మొదలు కానున్నట్టు టాలీవుడ్ వర్గాలవారి భోగట్టా. విజయదశమి రోజున అంటే అక్టోబర్ 15న ఈ సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభం కాబోతోందట. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే.. ఆయన సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించబోతోందన్న వార్తా వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.