వినోదాత్మకంగా కళాపురం

Published: Sat, 13 Aug 2022 00:54:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వినోదాత్మకంగా కళాపురం

కుల వివక్ష, పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ‘పలాస 1978’, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ లాంటి  చిత్రాలతో  ప్రేక్షకులను మెప్పించారు దర్శకుడు కరుణకుమార్‌. ఈ సారి ఆయన పంథా మార్చి హాస్యరస ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం ‘కళాపురం’. ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ నెల 26న విడుదలవుతోంది. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆర్‌ 4 ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి ప్రధాన తారాగణం. పవన్‌ కల్యాణ్‌ ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సందర్భోచిత హాస్యంతో ‘కళాపురం’ ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పంచింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International