Panchayats Justice:బాలికపై అత్యాచారానికి రూ.5లక్షల వెల

ABN , First Publish Date - 2022-09-03T13:51:03+05:30 IST

ఓ బాలికపై అత్యాచారానికిగాను రూ.5లక్షల వెల నిర్ణయించిన పంచాయితీ పెద్దల న్యాయం సంచలనం...

Panchayats Justice:బాలికపై అత్యాచారానికి రూ.5లక్షల వెల

ఇదీ బీహార్ గ్రామ పంచాయితీ పెద్దల న్యాయం

పాట్నా(బీహార్):ఓ బాలికపై అత్యాచారానికిగాను రూ.5లక్షల వెల నిర్ణయించిన పంచాయితీ పెద్దల న్యాయం సంచలనం రేపింది. ఐదులక్షల రూపాయల జరిమానా (penalty)చెల్లిస్తే చాలు రేప్ కేసు నుంచి విముక్తి కల్పిస్తామని ఓ గ్రామ పంచాయితీ సభ్యులు తీర్పు ఇచ్చిన ఘటన బీహార్(Bihar) రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. బీహార్ రాష్ట్రంలోని సికందర పోలీస్ స్టేషన్ పరిధిలోని జముయ్ గ్రామానికి చెందిన మహ్మద్ మొహిసిన్ ఓ బాలికను(girl) పెళ్లి(marriage) చేసుకుంటానని చెప్పి, ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఆపై పెళ్లి గురించి అడిగితే మహ్మద్ అత్యాచార బాధిత బాలికను పెళ్లాడేందుకు నిరాకరించాడు. 


దీంతో జముయ్ గ్రామ పంచాయితీ సభ్యులు, గ్రామ సర్పంచ్( panchayat members and sarpanch of the village) నిందితుడు మహ్మద్ ను పంచాయితీకి పిలిచారు. బాధిత బాలికకు రూ.5లక్షల రూపాయల జరిమానా చెల్లిస్తే అత్యాచారం కేసు నుంచి విముక్తి చేస్తామని పంచాయితీ పెద్దలు తీర్పు ఇచ్చారు.రూ.5లక్షలు చెల్లిస్తే రేప్ కేసు నుంచి విముక్తి కల్పిస్తామని పంచాయితీ పెద్దలు న్యాయం చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


 దీంతో నిందితుడు డబ్బు చెల్లించినా, బాధితురాలు మాత్రం డబ్బులు తీసుకునేందుకు నిరాకరించి స్థానిక సికంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.(lodged a complain)దీంతో నిందితుడు మహ్మద్ పై ఐపీసీ సెక్షన్లు 376, 34లకింద కేసు(police case) నమోదు చేసి, నిందితుడిని, అతని తండ్రిని అరెస్టు చేశామని పోలీస్ స్టేషన్ విచారణ అధికారి శర్మ చెప్పారు. 


Updated Date - 2022-09-03T13:51:03+05:30 IST