హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించండి

ABN , First Publish Date - 2020-12-04T04:49:57+05:30 IST

పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించా లని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌చేయాలని, కనీసవేతనం రూ 21వేలు చెల్లించాలని ఏపీ మునిసిపల్‌ ఉద్యోగులు, కార్మికుల కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించండి
పాలకొండ: కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న మునిసిపల్‌ కార్మికులు

  మునిసిపల్‌ కార్మికుల నిరసన

పాలకొండ:పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించా లని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌చేయాలని, కనీసవేతనం రూ 21వేలు చెల్లించాలని ఏపీ మునిసిపల్‌ ఉద్యోగులు, కార్మికుల కార్యాచరణ కమిటీ సభ్యులు డిమాండ్‌ చేశారు.గురువారం పాలకొండ నగరపంచా యతీ కార్యాలయం వద్ద మునిసిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించి, కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దావాల రమణారావు, మునిసిపల్‌ కార్మికులు పడాల భాస్కర రావు, పడాల వేణు పాల్గొన్నారు. ఫ పలాస: కార్మికుల వేతన బకాయి లు, హెల్త్‌అలవెన్స్‌లు చెల్లించాలని సీఐటీయూ నాయకుడు ఎన్‌.గణపతి, పారిశుధ్య కార్మిక సంఘ అధ్యక్షుడు సీహెచ్‌ మురుగన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ముసిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు రవి, కిషోర్‌, గులాబి పాల్గొన్నారు.



Updated Date - 2020-12-04T04:49:57+05:30 IST