అద్దె బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2022-09-24T06:31:49+05:30 IST

ఎస్సీ కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణదారులు అద్దె బకాయిలను చెల్లించి రసీదు పొందాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస విశ్వనాథ్‌ అన్నారు.

అద్దె బకాయిలు చెల్లించాలి

ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస విశ్వనాథ్‌

మార్కాపురం, సెప్టెంబరు 23: ఎస్సీ కార్పొరేషన్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణదారులు అద్దె బకాయిలను చెల్లించి రసీదు పొందాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస విశ్వనాథ్‌ అన్నారు. స్థానిక కోర్టు కూడలిలోని ఎస్సీ వాణిజ్య సముదాయంలోని దుకాణాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య సముదాయంలోని 11 దుకాణాలకు గాను రూ.9 లక్షల మేర అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వాణిజ్య సముదాయం నిర్మించి 38 ఏళ్లు గడిచిన నేపథ్యంలో మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని 93 ఎస్సీ వాణిజ్య సముదాయాలలో ఇతర సామాజిక వర్గం వారు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కార్యక్రమంలో కొణతం రాయప్ప, చేబ్రోలు ఐజాక్‌, రోజ్‌ లిదియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:31:49+05:30 IST