వేల కోట్లు కట్టని ప్రభుత్వంపై కమిషన్ ప్రేమ చూపుతోంది: పయ్యావుల కేశవ్

ABN , First Publish Date - 2021-11-12T19:26:01+05:30 IST

డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలను ప్రభుత్వ చెల్లించాలనే ఆదేశాలు కమిషన్ ఎందుకు...

వేల కోట్లు కట్టని ప్రభుత్వంపై కమిషన్ ప్రేమ చూపుతోంది: పయ్యావుల కేశవ్

అనంతపురం: డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలనే ఆదేశాలు కమిషన్ ఎందుకు ఇవ్వడంలేదని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల కోట్లు కట్టని ప్రభుత్వంపై కమిషన్ ప్రేమ చూపుతోందని విమర్శించారు.


మూడు నెలలుగా ట్రూ అప్ పేరుతో ప్రభుత్వం భారం వేసిందని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. కమిషన్ పబ్లిక్ హియరింగ్ చేయడం లేదని, ప్రజల్లోకి వచ్చి అభిప్రాయ సేకరణ చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం సుమారు రూ.25 వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం చెల్లించక పోవడం వల్ల ప్రజలపై భారం పడుతోందని, బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా ఏపీఈఆర్సీ ఆదేశాలు ఇవ్వాలని  పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-12T19:26:01+05:30 IST