నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థ నివ్వెరపోయే ఘటన: పయ్యావుల

ABN , First Publish Date - 2022-04-15T23:07:46+05:30 IST

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థ నివ్వెరపోయే ఘటన అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో

నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థ నివ్వెరపోయే ఘటన: పయ్యావుల

అమరావతి: నెల్లూరు కోర్టులో చోరీ న్యాయవ్యవస్థ నివ్వెరపోయే ఘటన అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఏ1గా ఉన్న.. కేసు సాక్ష్యాల అదృశ్యం చిన్నవిషయం కాదన్నారు. కాకాణి, ఇతర నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు సుమోటోగా తీసుకుని నిందితులను శిక్షించాలన్నారు. లేనిపక్షంలో న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పోయే ప్రమాదం ఉందని చెప్పారు. సాక్ష్యాల చోరీతో పాటు కేసు విచారణ కోర్టు పర్యవేక్షణలోనే జరగాలని డిమాండ్ చేశారు. కోర్టు తీవ్రంగా పరిగణించకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఉదాసీనత, నిర్లిప్తత తన పాత్ర ఉన్నట్లు రుజువుచేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వ అరాచకాలు పతాకస్థాయికి చేరాయని, న్యాయవ్యవస్థపై దాడి, ప్రశ్నించినవారిపై కేసులు పెడుతున్నారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

Updated Date - 2022-04-15T23:07:46+05:30 IST