IPL: SRHvsPBKS మ్యాచ్‌లో ఏం జరిగింది.. ఉమ్రాన్‌కు మయాంక్ అంత సీరియస్‌గా ఏం చెప్పాడో..

ABN , First Publish Date - 2022-05-23T23:33:49+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో అదరగొడుతున్న 22 ఏళ్ల యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. కారణం.. అతని బంతిని విసురుతున్న వేగమే. దాదాపు 150 kmphతో బుల్లెట్‌లా దూసుకొచ్చే..

IPL: SRHvsPBKS మ్యాచ్‌లో ఏం జరిగింది.. ఉమ్రాన్‌కు మయాంక్ అంత సీరియస్‌గా ఏం చెప్పాడో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో అదరగొడుతున్న 22 ఏళ్ల యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. కారణం.. అతని బంతిని విసురుతున్న వేగమే. దాదాపు 150 kmphతో బుల్లెట్‌లా దూసుకొచ్చే ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్న బంతి ఒక్కోసారి బ్యాట్స్‌మెన్స్‌ను బాగా ఇబ్బంది పెడుతోంది. 150 kmphకి పైగా వేగంతో వస్తున్న బంతి నేరుగా బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌కు గానీ, శరీరానికి గానీ తగిలితే ఎంత నొప్పిగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో కొన్నిసార్లు అలాంటి పరిస్థితులే బ్యాట్స్‌మెన్స్‌కు ఎదురవుతున్నాయి. GT vs SRH మ్యాచ్‌లో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న హార్థిక్ పాండ్యా చేతికి విసురుగా వస్తున్న బంతి తగిలింది.



150 kmphతో వస్తున్న బంతి తగలడంతో కాస్త ఇబ్బందిపడినప్పటికీ హార్థిక్ పాండ్యా ఆ తర్వాత నిలదొక్కుకుని ఆడాడు. తాజాగా.. SRH vs PBKS మ్యాచ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్‌కు ఎదురైంది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేస్తున్న ఏడో ఓవర్ మూడో బంతికి పంజాబ్ బ్యాటర్ షారూక్ ఖాన్ క్యాచ్‌గా దొరికిపోవడంతో ఔట్ అయి పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాత.. PBKS కెప్టెన్ మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్‌కు దిగాడు. మయాంక్ అగర్వాల్ క్రీజులో అలా దిగి తొలి బంతిని ఎదుర్కున్నాడో లేదో పంజాబ్ కెప్టెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసిన ఏడో ఓవర్ నాలుగో బంతి 143 kmph వేగంతో మయాంక్ పక్కటెముకలకు వచ్చి తగిలింది.



Leg Byesకు వెళ్లినప్పటికీ ఆ బంతి శరీరానికి తగలడం వల్ల మయాంక్ తీవ్రంగా బాధపడ్డాడు. అక్కడ ముట్టుకుంటే విలవిలలాడిపోయాడు. మయాంక్ కుప్పకూలిపోవడంతో Team Physio హుటాహుటిన ఫీల్డ్‌లోకి వచ్చి First Aid చేశాడు. ఆ తర్వాత ఆ నొప్పిని భరిస్తూనే మయాంక్ బ్యాటింగ్ చేసినప్పటికీ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. మ్యాచ్ అనంతరం మయాంక్ స్పందిస్తూ.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో గాయమైందని, x-ray తీయించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఇదిలా ఉంటే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న SRH బ్యాటింగ్ చేస్తుండగా ఉమ్రాన్ మాలిక్ వంతు వచ్చింది. ఉమ్రాన్ మాలిక్ బ్యాటింగ్‌కు వెళుతున్న సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అతనితో ఏదో మాట్లాడాడు. మయాంక్ కాస్త సీరియస్‌గానే ఉమ్రాన్‌తో సంభాషించాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏం మాట్లాడుకున్నారో తెలియదు.

Updated Date - 2022-05-23T23:33:49+05:30 IST