Jaggareddy: భావితరాలు రాజీవ్ గాంధీ చరిత్ర తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-20T17:16:08+05:30 IST

భావితరాలు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చరిత్రను తెలుసుకోవానలి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Jaggareddy: భావితరాలు రాజీవ్ గాంధీ చరిత్ర తెలుసుకోవాలి

హైదరాబాద్: భావితరాలు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv gandhi) చరిత్రను తెలుసుకోవానలి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి "(Jagga reddy) అన్నారు. శనివారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి జగ్గారెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ దేశం కోసం బలిదానం అయ్యారన్నారు. గాంధీ (Gandhi), నెహ్రు (Nehru), ఇందిరా గాంధీ (Indira Gandhi), రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) దేశం కోసం చేసిన త్యాగాలను మనమందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారత దేశ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉండేలా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అన్ని కులాలు, మతాలు ఒక్కటని నమ్మి ముందుకు వెళ్ళేపార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. 18 ఏళ్లకు ఓటు హక్కు తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది అని కొనియాడారు. టెక్నాలజీని అభివృద్ది చేసిన ఘనత కూడా రాజీవ్ గాంధీ దే అని అన్నారు. ఈ రోజు ఇన్ని కోట్ల జనాభా సెల్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారంటే రాజీవ్ గాంధీ టెక్నాలజీ అభివృద్ధికి చేసిన కృషే కారణమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-20T17:16:08+05:30 IST