నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు

ABN , First Publish Date - 2022-05-15T04:23:14+05:30 IST

జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను విక్ర యిస్తే పీడీయాక్టు అమలుచేస్తామని ఏఎస్పీ అశ్చేశ్వర్‌రావు అన్నారు. శనివారం రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్కడక్కడ నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నట్టు దృష్టికి వచ్చిందన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ అశ్చేశ్వర్‌ రావు

రెబ్బెన, మే 14: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను విక్ర యిస్తే పీడీయాక్టు అమలుచేస్తామని ఏఎస్పీ అశ్చేశ్వర్‌రావు అన్నారు. శనివారం రెబ్బెన పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్కడక్కడ నకిలీ పత్తివిత్తనాలను విక్రయిస్తున్నట్టు దృష్టికి వచ్చిందన్నారు. అటు వంటి వారిని పట్టుకొని కఠినచర్యలు తీసుకుంటా మన్నారు. ఇటీవల రెబ్బెనసీఐ నరేందర్‌, ఎస్సై భవానీ చాకచక్యంగా వ్యవహరించి మండలంలో రూ.5.60 లక్షల విలువగల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవటంతో పాటు అందుకు బాధ్యులైన రాంటెంకి శ్రీకాంత్‌, గజ్జల సృజన్‌, ప్రేంకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారివద్ద 273కిలోల పత్తివిత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఆసిఫాబాద్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ నరేందర్‌, ఎస్సై భవానీ తదితరులు పాల్గొన్నారు.

Read more