నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ కేసులు : ఏడీఏ

ABN , First Publish Date - 2021-06-15T06:13:09+05:30 IST

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ కేసులు నమోదు చేస్తామని ఏడీఏ హరిత హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ కేసులు : ఏడీఏ
రాయికోడ్‌లో మాట్లాడుతున్న ఏడీఏ హరిత

రాయికోడ్‌, జూన్‌ 14 : రైతులకు  నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ కేసులు నమోదు చేస్తామని ఏడీఏ హరిత హెచ్చరించారు. సోమవారం  రాయికోడ్‌లోని రైతువేదిక సమావేశ మందిరంలో మండలంలోని ఎరువుల డీలర్లకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎరువులు, డీలర్లు రైతులకు నాణ్యమైన ఎరువులు విత్తనాలు, పురుగుమందులు అమ్మాలని ఆమె సూచించారు. స్టాక్‌ రిజిష్ట్రర్‌, ఈ పాస్‌ మిషన్లు ఉపయోగించాలని సూచించారు. లైసెన్సు లేకుండా ఎరువులు అమ్మితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్ఛరించారు. ఎస్‌ఐ ఏడుకొండలు  మాట్లాడుతూ  ఎరువులు కొన్న రైతుకు విధిగా డీలర్లు బిల్లులు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి అవినా్‌షశర్మ, డీలర్లు  కృష్ణ, సిరాజ్‌, శంకర్‌, రవి, తదితరులు పాల్గొన్నారు. 


పెద్దశంకరంపేటలో తనిఖీలు

పెద్దశంకరంపేట/రేగోడు, జూన్‌ 14: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు  కేసు నమోదు చేస్తామని ఇన్‌చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాంప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలో విత్తనాలు మరియు ఎరువుల దుకాణాల్లో సోమవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లోనూ రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఈవో అమృత్‌ ఉన్నారు. రేగోడు మండలంలో నకిలీ విత్తనాలు, పురుగు మందులను అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సత్యనారాయణ హెచ్చరించారు. నకిలీ మందులు అంటగడితే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-06-15T06:13:09+05:30 IST