ఆంధ్రాకు రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు

ABN , First Publish Date - 2022-05-27T15:37:26+05:30 IST

ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా రేషన్‌ బియ్యం తరలించిన వ్యవహారంలో మూడేళ్లలో 1,740 మందిని అరెస్ట్‌ చేసినట్లు రాష్ట్ర రేషన్‌ సరుకుల అక్రమ రవాణా నిరోధక

ఆంధ్రాకు రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు

                       - మూడేళ్లలో 1,740 మంది అరెస్ట్‌

`                                                                                                                         ప్యారీస్‌(చెన్నై): ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా రేషన్‌ బియ్యం తరలించిన వ్యవహారంలో మూడేళ్లలో 1,740 మందిని అరెస్ట్‌ చేసినట్లు రాష్ట్ర రేషన్‌ సరుకుల అక్రమ రవాణా నిరోధక విభాగం డీజీపీ అభా్‌షకుమార్‌ తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధీనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చౌక దుకాణాల ద్వారా కుటుంబకార్డుదారులకు నాణ్యమైన బియ్యం, చక్కెర, గోధుమలు, కందిపప్పు తదితరాలను  పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరుకులను వినియోగదారులకు పంపిణీ చేయకుండా అక్రమంగా ఆంధ్రాకు తరలించడాన్ని అడ్డుకొనేందుకు పోలీసు శాఖ పలు చర్యలు చేపట్టింది. ఇందుకోసం తిరువళ్లూర్‌ జిల్లాలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ఆరంబాక్కం సహా పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనతనిఖీలు ముమ్మరం చేసింది. 2021 మే నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించినందుకు మొత్తం 937 కేసులు నమోదయ్యాయి. 12,540 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించి 836 మందిని అరెస్ట్‌ చేయగా, 211 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా, 23 మందిపై గూండా చట్టం ప్రయోగించి జైలుకు తరలించారు. ఈ రకంగా గత మూడేళ్లలో 1,740 మందిని అరెస్ట్‌ చేసినట్లు అభాష్ కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-05-27T15:37:26+05:30 IST