పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల చేస్తున్న నేతలు, విక్రమ్ విద్యా సంస్థల డైరెక్టర్ విజయబాబు
సూళ్లూరుపేట, జనవరి 24 : గుంటూరులో ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న పీడీఎస్యూ రాష్ట్ర మహాసభల కరపత్రాలను సోమవారం సూళ్లూరుపేటలో స్థానిక ప్రతిభ, విక్రమ్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయబాబు, నాయకులు ఆవిష్కరించారు. పీడీఎస్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్, జిల్లా కార్యదర్శి లోకేష్, పట్టణ అధ్యక్షుడు వరప్రసాద్, చక్రపాణి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.