ప్రశాంతంగా దసరా మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-10-07T05:05:23+05:30 IST

దసరా ఉత్సవాల్లో రెండో మైసూరుగా ప్రఖ్యాతి గాం చిన పసిడిపురిలో భారీ పోలీసు బందోబస్తు నడు మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతం గా ముగిశాయి.

ప్రశాంతంగా దసరా మహోత్సవాలు
వాసవీ అమ్మవారి తొట్టి మెరవణి

వైభవంగా శమీదర్శనం 

శోభాయమానంగా తొట్టి మెరవణి

ట్రాఫిక్‌ మళ్లింపు - భారీ బందోబస్తు 

పర్యవేక్షించిన ఎస్పీ అన్బురాజన్‌

ప్రొద్దుటూరు క్రైం/ప్రొద్దుటూరు టౌన్‌, అక్టోబరు 6: దసరా ఉత్సవాల్లో రెండో మైసూరుగా ప్రఖ్యాతి గాం చిన పసిడిపురిలో భారీ పోలీసు బందోబస్తు నడు మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రశాంతం గా ముగిశాయి. అమ్మవారి శమీదర్శనం మహోత్స వం వైభవంగా నిర్వహించారు. రాత్రి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి తొట్టిమెరవణి వేడుకగా చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయదశమి సందర్భంగా ఎస్పీ అన్బురాజన్‌ పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. 

వైభవంగా శమీదర్శనం

 అమ్మవారి శమీదర్శన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం వివిధ అ మ్మవార్ల శమీదర్శనం వైభవంగా చేపట్టారు. వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి, శివాలయం, చెన్నకేశవస్వామి, రాజరాజేశ్వరిదేవి, చౌడేశ్వరిదేవి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి శమీ వృక్ష మండపం వద్ద అమ్మవారికి దర్శనం చేయించారు. కళాకారుల నృత్య ప్రదర్శన లు, బాణసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. కొర్రపాడు రోడ్డు జనసంద్రంగా మారింది. 

శోభాయమానంగా తొట్టి మెరవణి

 వాసవీ కన్యకాపరమేశ్వరిదేవిని విజయలక్ష్మిదేవిగా అలంకరించి తొట్టి మెరవణి శోభాయమానంగా నిర్వహించారు. ఆభరణాలు, గజమాలలతో అమ్మవారిని అలంకరించి పంచలోహ హంసవాహన ర థంపై ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. తొట్టి మెరవణి బంగారంగళ్లు, మెయిన్‌ బజార్‌, ప ప్పుల బజార్‌ మీదుగా శివాలయం సెంటర్‌కు చేరుకుంది. శివాలయం ఎదురుగా ఉన్న మైదానంలో బాణసంచా పేలుళ్లు భక్తులను ఆకట్టుకున్నాయి. తొట్టి మెరవణి సందర్భంగా కేరళ సింగారిమేళం, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో పురవీధులు కిటకిటలాడాయి. 

బందోబస్తును పర్యవేక్షించిన ఎస్పీ

 శమీదర్శనం సందర్భంగా శివాలయంవీధిలో బం దోబస్తును ఎస్పీ పర్యవేక్షించారు. ఏఎస్పీ, సీఐలకు బందోబస్తు సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏఎస్పీ ప్రేర్ణకుమార్‌ నేతృత్వంలో పట్టణ సీఐలు రాజారెడ్డి, ఇబ్ర హీం, నారాయణయాదవ్‌, యుగంధర్‌, మధుసూదన్‌గౌడ్‌ పర్యవేక్షణలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఎస్పీకి ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రామ్మోహన్‌రావు అమ్మవారి చిత్రపటాన్ని బహూక రించారు. విజయదశమి మహోత్సవం పోలీసు పహారాలో ప్రశాంతంగా జరిగింది.   

ఎర్రగుంట్లలో....

ఎర్రగుంట్ల, అక్టోబరు 6: శరన్నవరాత్రి మహోత్సవా లు ఘనంగా ముగిశాయి. విజయదశమిరోజున అమ్మవారిని విజయలక్ష్మిదేవిగా అలంకరించారు. సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం శమీదర్శనం నిర్వహించారు. రాత్రికి అమ్మవారు పురవీధుల్లో ఊరేగారు. వాయిద్యాలతో, భజనలతో ఈ ఉత్సవం తెల్లవారుజాము వరకు సాగిం ది. గురువారం ఉదయం వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. చిలమకూరులోని శ్రీవేంకటేశ్వరాలయంలో గోదామహాలక్ష్మి దేవికి విజయలక్ష్మిదేవి అలంకారం నిర్వహించి రాత్రికి గ్రామోత్సవం చేశారు.

కొండాపురంలో....

కొండాపురం, అక్టోబరు 6: విజయదశమితో ఉత్సవా లు ఘనంగా మగిశాయి. కొండాపురం అమ్మవారిశాలలో విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. దత్తాపురంలో పెద్దమ్మతల్లి ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విజయదశమి చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు.

మైదుకూరులో....

మైదుకూరు రూరల్‌ అక్టోబరు 6: వైభవంగా దసరా ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. బుధవారం రాత్రి ఆర్యవైశ్యులు అమ్మవారి గ్రామోత్సవం ఘనం గా నిర్వహించారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులతో, వినూత్నంగా వివిధ రకాల బాణ సంచా, డప్పు వాయిద్యాల మధ్య వాసవీ కన్యాకాప రమేశ్వరి అమ్మవారి ఉరేగింపు జరిగింది. మైదుకూ రు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్‌, కార్యవర్గం దసరా ఉత్సవాలను నిర్వహించారు.

ఖాజీపేటలో....

ఖాజీపేట, అక్టోబరు 6: దసరా ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. తొమ్మిది రోజులు అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు  విజయలక్ష్మిదేవి అలంకారంలో దర్శనమివ్వడంతో భక్తులు అమ్మవారికి కాయాకర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. బుధవారం రాత్రి డప్పు వాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల నడుమ వైభవంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారి వేషధారణలో ఊరేగింపుగా తరలి వచ్చారు. గురువారం పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి యువత రంగులు చల్లుకుంటూ కేరింతలతో తిరిగారు.

బ్రహ్మంగారిమఠంలో....

బ్రహ్మంగారిమఠం, అక్టోబరు 6: మండల కేంద్రంలో  దసరా మహోత్సవాల సందర్భంగా విజయదశమితో వీరబ్రహ్మేంద్రస్వామి సమేత గోవిందమాంబ, వీర బ్రహ్మేంద్రస్వామి మనుమరాలు జగన్మాత ఈశ్వరీ దేవి అమ్మవారు శమీపూజ నిర్వహించారు. శ్రీకన్య కాపరమేశ్వరి దేవి అమ్మవారు ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో  శమి పూజ చేపట్టారు. 

పోరుమామిళ్లలో....

పోరుమామిళ్ల,  అక్టోబరు 6: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి వాసవీ కన్యకాపరమేశ్వ రి ఆలయంలో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహిం చారు. రాత్రి అమ్మవారిని ఊరేగించారు. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాలను పట్టణంలో ఊరేగించారు. కర్ణాటక మహిళా వాయిద్యకారులు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నారు. 

దువ్వూరులో....

దువ్వూరు, అక్టోబరు 6: దసరా పండుగను పురస్కరించుకుని దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు విజయదశమి సందర్భంగా ఊరేగించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.








Updated Date - 2022-10-07T05:05:23+05:30 IST