ఆర్‌బీకేల్లో శనగ విత్తనాలు

ABN , First Publish Date - 2021-10-24T07:09:57+05:30 IST

రాయితీ శనగ విత్తనాలను ఆర్‌బీకేల ద్వారా అందించేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది.

ఆర్‌బీకేల్లో శనగ విత్తనాలు

వ్యవసాయ శాఖ కసరత్తు

రాయితీ 25 శాతానికి కుదింపు

85,000 హెక్టార్లలో సాగు అంచనా

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 23 : రాయితీ శనగ విత్తనాలను ఆర్‌బీకేల ద్వారా అందించేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విత్తనాలను ఆయా వ్యవసాయ డివిజన్ల వారీగా కేటాయించడానికి ఏర్పాట్లు  చేస్తోంది.  రబీ సీజన్‌లో జిల్లాలో 85,000 హెక్టార్లలో శనగ సాగయ్యే అవకాశముందని యంత్రాంగం అంచనా వేస్తోంది. గతంలో శనగ విత్తనాలను 30 శాతం రాయితీతో అందించేవారు. ఈసారి దానిని 25 శాతానికే పరిమితం చేశారు. 


కృషి యాప్‌లో నమోదు చేసుకోవాలి

విత్తనాలు కావాల్సిన రైతులు కృషి యాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసిన వారికే ఆర్‌బీకేల ద్వారా అందిస్తారు. జిల్లాకు దాదాపు 55,000 క్వింటాళ్ల శనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండు హెక్టార్ల వరకు విత్తనాలు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులు రాయితీ సదుపాయాన్ని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని వారు కోరుతున్నారు. 





Updated Date - 2021-10-24T07:09:57+05:30 IST