ధరాభారంతో ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం

ABN , First Publish Date - 2022-05-26T05:18:43+05:30 IST

వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయిందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ శంకర్‌ యాదవ్‌ ఆరోపించారు.

ధరాభారంతో ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం
బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు

బి.కొత్తకోట మే 25 : వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రజల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం అయిందని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్‌ శంకర్‌ యాదవ్‌ ఆరోపించారు. బి.కొత్తకోటలో బుధవారం బాదుడే బాదుడు  కార్యక్రమం నిర్వహించారు. బీసీ కాలనీ నుంచి బెంగళూరు రోడ్డు, మెయినరోడ్డు, దిగువ బస్టాండు, బైపాస్‌ రోడ్డు, రంగసముద్రం రోడ్డు మీదుగా జ్యోతి బస్టాండు వరకు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం  జ్యోతి బస్టాండులో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎలాంటి చార్జీలు, పన్నులు పెంచబోమని ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే జగనరెడ్డి విస్మరించాడన్నారు. చెత్తపన్ను వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అరాచక పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో తంబళ్ళపల్లె నియోజక వర్గంలోనూ, రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ నారాయణస్వామి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దేవరింటి కుమార్‌, టౌన ప్రెసిడెంట్‌ బంగారు వెంకట్రమణ, ప్రధాన కార్యదర్శి ఓబులేసు, టీడీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ. మస్తాన, మొలకలచెర్వు  మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన శ్రీనాథ్‌రెడ్డి, జిల్లా ఎగ్జ్యూక్యూటివ్‌ మెంబర్‌ సుకుమార్‌, తంబళ్ళపల్లె నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అద్యక్షుడు సురేంద్రబాబు, పీటీఎం జడ్పీటీసీ  మాజీ సభ్యుడు ఈశ్వరప్ప, బి.కొత్తకోట, బడికాయలపల్లె, తుమ్మనంగుట్ట మాజీ సర్పంచులు కుడుం శ్రీనివాసులు, కృష్ణమూర్తి, అనంద్‌రెడ్డి,  టీడీపీ నాయకులు కనకంటి ప్రసాద్‌, దేవుడు నాగరాజ, రియాజ్‌ అలీ,తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక  

బి.కొత్తకోట మాజీ ఉప సర్పంచ షమీవుల్లా బుధవారం  టీడీపీలో చేరారు. శంకర్‌ యాదవ్‌ ఆయనకు టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

Updated Date - 2022-05-26T05:18:43+05:30 IST