పుట్ట మధుకు సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారులకు షాక్..

ABN , First Publish Date - 2021-05-09T17:19:59+05:30 IST

అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జిల్లాలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి...

పుట్ట మధుకు సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారులకు షాక్..

పెద్దపల్లి : అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత జిల్లాలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంథని నియోజకవర్గంలో పలువురు పోలీసులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పుట్ట మధు అరెస్ట్‌కు ముందు ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో పోలీసులను బదిలీలు చేశారు. పుట్ట మధుకు సన్నిహితంగా ఉన్న పోలీస్ అధికారుల జాబితాను సేకరించి మరీ బదిలీ చేశారు. అదేవిధంగా మంథని సీఐ మహేందర్, ఎస్సై ఓంకార్‎తో పాటు.. ముత్తారం ఎస్ఐ నరసింహారావు, రామగిరి ఎస్‌ఐ మహేందర్ బదిలీ చేస్తున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం, పుట్టా మధు అరెస్టులతో రాష్ట్రంలో రాజకీయ చర్చ జరుగుతోంది.

Updated Date - 2021-05-09T17:19:59+05:30 IST