ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవానికి సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-01-18T05:35:37+05:30 IST

పెద్దాపురం, జనవరి 17: పట్టణ శివారులో ఉన్న హజరత్‌ షేక్‌ మదీనా పాచ్ఛా ఔలియా, హజరత్‌షా రహమతుల్లా వార్ల ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవం ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మమద్‌ లాయక్‌ ఆ

ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవానికి సర్వం సిద్ధం
పెద్దాపురంలో గంధోత్సవానికి ముస్తాబైన దర్గా

ఈనెల 20 నుంచి 22 వరకూ ప్రత్యేక కార్యక్రమాలు 

వేలాదిగా తరలిరానున్న అశేష భక్తజనం 

పెద్దాపురం, జనవరి 17: పట్టణ శివారులో ఉన్న హజరత్‌ షేక్‌ మదీనా పాచ్ఛా ఔలియా, హజరత్‌షా రహమతుల్లా వార్ల ఉరుస్‌ షరీఫ్‌ గంధోత్సవం ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మమద్‌ లాయక్‌ ఆలీ తెలిపారు. 350 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ గంధోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి కులమతాలకు అతీతంగా పెద్దసంఖ్యలో వేలాదిగా తరలివచ్చే అశేష భక్తజనులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. గంధోత్సవంలో భాగంగా ఈనెల 20న ముస్లిం అంజుమన్‌ వ్యవస్థాపకుడు ఎంఏ సత్తార్‌ గృహం నుంచి గంధం ఊరేగింపు మేళతాళాలతో బయలుదేరి దర్గాకు చేరుకుంటుందని, హైదరాబాద్‌ నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక పచ్చటి వస్త్రాన్ని బాబా వారికి అలంకరించి ఖురాన్‌ పఠనం, అలాగే గంఽధాన్ని సమాధికి పూస్తారని చెప్పారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ గంధోత్సవంలో కులమతాలకతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవులు పాల్గొంటారన్నారు. అలాగే దర్గా వద్ద ఖురాన్‌ ఖానీ, ఫాతేహాఖానీ, వాజ్‌, ఖవ్వాళీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. చివరిరోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. గంధోత్సవానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, జనసేన ఇన్‌చార్జ్‌ తుమ్మల బాబు, పలువురు ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. అధికసంఖ్యలో భక్తులు హాజరై ఈ గంధోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-01-18T05:35:37+05:30 IST