‘చంద్రబాబూ.. దమ్ముంటే కుప్పంలో రాజీమా చెయ్.. పోటీచేద్దాం’

ABN , First Publish Date - 2022-04-30T12:37:26+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దమ్ముంటే ఆయనగానీ, ఆయన

‘చంద్రబాబూ.. దమ్ముంటే కుప్పంలో రాజీమా చెయ్.. పోటీచేద్దాం’

చిత్తూరు జిల్లా/బి.కొత్తకోట : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు దమ్ముంటే ఆయనగానీ, ఆయన కుమారుడు లోకేశ్‌ గానీ తంబళ్లపల్లె నియోజకవర్గంలో తనపై పోటీచేసి డిపాజిట్లు దక్కించుకోవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సవాల్‌ విసిరారు. మండలంలో నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘కుప్పంలో రాజీనామా చెయ్‌ నువ్వు నేను పోటీచేద్దాం నీకు డిపాజిట్స్‌ గల్లంతు చేస్తా, లేదా నాకు డిపాజిట్స్‌ గల్లంతు అయితే నేను రాజకీయం సన్యాసం చేస్తా’నంటూ సవాల్‌ విసిరారు. సమావేశంలో సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ అమరనాథ్‌, ఎంపీపీ లక్ష్మీనరసమ్మ, అంగళ్లు మార్కెట్‌కమిటీ డైరెక్టర్‌ అయూబ్‌, మాజీ ఉపసర్పంచి మాలిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-30T12:37:26+05:30 IST