రైతుల సంక్షేమం కోసమే గోదాముల నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-02-28T04:38:32+05:30 IST

రైతుల సంక్షేమం కోసమే గోదాముల నిర్మాణాలు

రైతుల సంక్షేమం కోసమే గోదాముల నిర్మాణాలు
పెద్దకొర్పోలులో మాట్లాడుతున్న సుదర్శన్‌రెడ్డి, సామెల్‌








1234 1234 1234 1234 1234 1234 

నెక్కొండ, ఫిబ్రవరి 27 : గిట్టుబాటు ధర వచ్చే వరకు ఉత్పత్తుల్ని భద్రపర్చుటకు గోదాముల సముదాయాలను నిర్మిస్తున్నట్టు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామెల్‌ తెలిపారు. శనివారం పెద్దకొర్పోలులో గోదాములు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40లక్షల మేట్రిక్‌ టన్నుల సామర్య్ధం కల్గిన గోదాములను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకో గా, 20 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాముల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. మిగిలిన గోదాముల నిర్మాణాలకు స్థలాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మైబుబ్‌పాషా, ఎంపీపీ రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సూరయ్య తదితరులు పాల్గొన్నారు.

నల్లబెల్లి: అర్షనపల్లి, గుండ్లపాడ్‌ గ్రామాల్లో వ్యవసాయ గోదాంల నిర్మాణాల కోసం ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ చెట్టుపల్లి మురళీధర్‌, మాజీ ఎంపీపీలు బానో తు సారంగపాణి, కక్కెర్ల శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T04:38:32+05:30 IST