పేదల కాలనీల్లో..సమస్యల నెలవు!

ABN , First Publish Date - 2022-07-07T06:04:05+05:30 IST

పేదల కాలనీల్లో..సమస్యల నెలవు!

పేదల కాలనీల్లో..సమస్యల నెలవు!
ప్రొద్దుటూరులో విద్యుత్‌ తీగలు లేకుండా దర్శనమిస్తున్న ఖాళీ స్తంభాలు

  అధ్వానంగా రహదారులు,

 తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించని అధికారులు 

  ఇళ్ల నిర్మాణాలపై మాత్రం ఒత్తిళ్లు 

  పెరిగిపోతున్న ఖర్చు.. లబోదిబోమంటున్న జగనన్న  ఇళ్ల లబ్ధిదారులు

కంకిపాడు, జూలై 6 : జగనన్న కాలనీల్లో సమస్యలతో లబ్ధిదారులు సతమతమవతు న్నారు. సరైన రోడ్లు లేవు.. విద్యుత్‌, తాగునీటి సదుపాయం అసలే లేదు.  ప్రజాప్రతి నిధులు గాని, ప్రభుత్వ అధికారులు గాని పట్టిం చుకున్న దాఖలాలు లేవు.. మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు ఏడు వేల మందికి జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారు లను ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా కంకిపాడు లబ్ధిదా రులకు గొడవర్రు, వేల్పూరు గ్రామాల్లో ఇళ్లస్థలాలు కేటాయించింది. అదే విధంగా వేల్పూరు, ప్రొద్దుటూరు, గొడవర్రు, ఉప్పలూరు, కుందేరు, పునాదిపాడులో ఇళ్లస్థ లాలు కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతి నిధులు ఒతిళ్లు తీసుకువస్తున్నారు. లేని పక్షం లో ఇళ్ల పట్టాలు తీసేకుంటామని హెచ్చ రిస్తు న్నారు. ఒత్తిళ్లు భరించలేక అప్పుచేసి ఇళ్లు మొదలు పెడితే.. నిర్మాణ సామాగ్రి ఇసుక, సిమెంట్‌, కంకర, ఇనుము రావాలంటే రోడ్లపై వాహనాలు దిగబడి పోతున్నాయి.  పది రూపాయలు ఖర్చు అయ్యే చోట వంద రూపాయలు అవుతున్నాయి. అష్టకష్టాలు పడి ఇళ్ల వద్దకు సామాగ్రి చేర్చితే వాటిని దొంగలు తస్కరిస్తున్నారు. ఇళ్ల నిర్మాణా ఖర్చు పెరిగిపో వటంతో కొద్ది మంది మినహా ఎక్కు వ మంది ఇళ్లు పూర్తి చేయలేక పోతున్నారు. పూర్తికాని ఇళ్లు చీకటి పడితే అసాంఘిక కార్యక్ర మాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జగనన్న కాలనీ ల్లో రహదారుల నిర్మాణంతో పాటు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2022-07-07T06:04:05+05:30 IST