ఈ ఏడాది చివరికి ఉద్దానానికి వంశ‘ధార

ABN , First Publish Date - 2021-06-20T05:37:28+05:30 IST

వంశధార రిజర్వాయర్‌ నుంచి ఉద్దానం ప్రాంతానికి ఈ ఏడాది చివరి నాటికి తాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి లఠ్కర్‌, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి హిరమండలంలో వంశధార రిజర్వాయర్‌తో పాటు దానికి అనుబంధంగా జరుగుతున్న ఉద్దానం నీటి ప్రాజెక్టు పనులను పరిశీలించారు.

ఈ ఏడాది చివరికి ఉద్దానానికి వంశ‘ధార
ప్రాజెక్టు వివరాలను మంత్రి, కలెక్టర్‌లకు వివరిస్తున్న అధికారులు



మంత్రి అప్పలరాజు’

కొత్తూరు (హిరమండలం), జూన్‌ 19: వంశధార రిజర్వాయర్‌ నుంచి ఉద్దానం ప్రాంతానికి ఈ ఏడాది చివరి నాటికి తాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం  కలెక్టర్‌ శ్రీకేశ్‌ బి లఠ్కర్‌, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతితో కలిసి హిరమండలంలో వంశధార రిజర్వాయర్‌తో పాటు దానికి అనుబంధంగా జరుగుతున్న ఉద్దానం నీటి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు రిజర్వాయర్‌ పనులు పురో గతిని వారికి వివరించారు. రిజర్వాయర్‌ ద్వారా సాగునీటిని వినియోగించుకోగా మిగిలిన నీటిని ఉద్దానానికి పంపించడం జరుగుతుందని ఎస్‌ఈ తెలిపారు.  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ వి.ఈశ్వరరావు ఉద్దానం ప్రాజె క్టుకు సంబందించి జరుగుతున్న హెడ్‌ వర్క్స్‌ వివరాలను వివరించారు.  హిరమండలం రిజర్వాయర్‌ నుంచి ఉద్దానం వరకు అండర్‌ గ్రౌండ్‌ పైపులైను ద్వారా వంశధార నీటిని పంపించనున్నట్లు చెప్పారు. పనులు వేగవంతం చేసేందుకు ఇసుక సమస్య ఉందని అధికారులు పేర్కొనగా ఇసుక రీచ్‌కు త్వరలో అనుమతిస్తామని కలెక్టర్‌ చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు, ప్రభుత్వం తో చర్చించి భూసేకరణ సమస్య పరిష్కరిస్తామని, పనులు వేగ వంతం చేయాలని మంత్రి అప్పలరాజు ఆదేశించారు.  అనంతరం మంత్రి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ.. ‘వైఎస్‌ఆర్‌ సుజలధార’లో భాగంగా రూ.700 కోట్లతో ఉద్దానం వాటర్‌ ప్రాజెక్టు పనులు చేపడుతున్నామన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాలున్న ఏడు మండలాల ప్రజలకు శుద్ధి చేసిన నీటిని ఇంటింటికీ కొళాయిల ద్వారా అందిస్తామన్నారు. పైపులైన్‌ పనులు సమారు 40 శాతం  జరిగాయని, 504 గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను నిర్మిస్తున్నామన్నారు. అదనంగా మరో 200 ట్యాంకుల నిర్మాణానికి రూ.60 కోట్లతో ప్రభు త్వానికి ప్రతిపాదన పంపించా మన్నారు. కార్యక్రమంలో వంశధార ఈఈ సుశీల్‌కుమార్‌, ఆర్‌డబ్లూఎస్‌ డీఈఈలు మధుసూదనరావు, ఆశా లత, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో ప్రభావతి పాల్గొన్నారు.



సర్వాంగ సుందరంగా పలాస 

పలాస: పలాస-కాశీబుగ్గ పురపాలకసంఘాన్ని సర్వాంగసుందరం గా తీర్చిదిద్దుతామని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. శనివారం స్థానిక ఒకటో వార్డు మొగిలిపాడులో పారిశుధ్య వారోత్స వాలను  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  క్లీన్‌ ఆంధ్ర ప్రదేశ్‌ కార్యక్రమంలో భాగంగా  రాష్ట్రంలో తొలిసారిగా పలాస- కాశీబుగ్గ లోనే ప్రారంభిం చినట్లు తెలిపారు. గ్రామంలో నిర్మించిన రోడ్డు ను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో చైర్మన్‌ బళ్ల గిరిబాబు, వైస్‌చైర్మన్‌ బోర కృష్ణారావురెడ్డి, ఏఎంసీ చైర్మన్‌  పీవీ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు. అలాగే రెండో సచివాలయం పరిధిలో పారిశుధ్య వారో త్సవాలను కమిషనర్‌ డి.రాజగోపాలరావు ప్రారంభించారు. 

 


 

Updated Date - 2021-06-20T05:37:28+05:30 IST