పేదింటి బాలలు.. చదువుల్లో మెరికలు

ABN , First Publish Date - 2021-12-09T04:36:17+05:30 IST

వారంతా నిరుపేదలు.. చదువుల్లో మాత్రం సరస్వతీ బిడ్డలు.. ఉపాఽధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విన్నారు. ట్రిపుల్‌ ఐటీ పరీక్ష ఎంట్రన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకొని ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో సీట్లు సాధించారు..

పేదింటి బాలలు.. చదువుల్లో మెరికలు
వేగూరు జడ్పీ ఉన్నత పాఠశాల

 ట్రిపుల్‌ ఐటీ సీట్లు సాధించిన వేగూరు జడ్పీ ఉన్నత పాఠశాల


కోవూరు, డిసెంబరు 8: వారంతా నిరుపేదలు.. చదువుల్లో మాత్రం సరస్వతీ బిడ్డలు..  ఉపాఽధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విన్నారు. ట్రిపుల్‌ ఐటీ పరీక్ష ఎంట్రన్స్‌లో మంచి మార్కులు తెచ్చుకొని ప్రతిష్ఠాత్మక ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో సీట్లు సాధించారు.. వారే కోవూరు మండలంలోని వేగూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు. కాగా వేగూరు వంటలకు ప్రసిద్ధి. అయితే చదువుల్లోనూ గ్రామం పేరు నిలబెడుతూ ఇక్కడి విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తున్నారు.


ఉత్తమ ఇంజనీర్‌ అవుతా..

ఉత్తమ ఇంజనీర్‌ను అవుతాను. వేగూరు జడ్పీహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయులు ఉన్నత బోధన అందించారు. క్లిష్టమైన పాఠ్యాంశాలను పలుమార్లు బోధన చేసి మాకు అర్థమయ్యేలా చెప్పారు. ట్రిపుల్‌ ఐటీ విశిష్టతను వివరించి, అందులో సీటు సాధించేలా తర్ఫీదు ఇచ్చారు. కొవిడ్‌ సమయంలో సైతం ఆన్‌లైన్‌లో బోధన అందించారు. దీంతో ట్రిపుల్‌ ఐటీ శ్రీకాకుళంలో సీటు సాధించాను. ఉత్తమ ఇంజనీర్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.

- సీహెచ్‌. కృష్ణవర్ధన్‌, విద్యార్థి


సివిల్స్‌ సాధిస్తా

ఉత్తమ ఇంజనీర్‌ అయిన తర్వాత సివిల్స్‌ సాధిస్తాను. మా పాఠశాలలో కార్పొరేట్‌ పాఠశాలకు ధీటుగా ఉత్తమ బోధన అందిస్తున్నారు. ఉపాఽఽధ్యాయుల ప్రోత్సాహం చాలా బాగుంది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో ఉత్తమ బోధన అందించారు. అందువల్లే నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించగలిగాం.

- ఎన్‌. సాయికృష్ణ, విద్యార్థి


ఉన్నత కొలువే లక్ష్యం..

ఉత్తమ ఇంజనీర్‌ను అవుతాను. ఉన్నత కొలువులు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. మా ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ బోధన అందిస్తున్నారు. అన్నీ సబ్జెక్టుల్లో బోధన అందిస్తున్నారు.  నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించాను. ఉన్నత కొలువు సాధించి మా గ్రామానికి, పాఠశాలకు సేవ చేస్తా. ఉపాఽఽధ్యాయుల ప్రత్యేక తర్ఫీదుతో ఈ సీటు సాధించాం.

- పి. హారిక,  విద్యార్థిని


Updated Date - 2021-12-09T04:36:17+05:30 IST