వైభవంగా గూగూడు కుళ్లాయిస్వామి చిన్న సరిగెత్తు

ABN , First Publish Date - 2022-08-07T05:18:55+05:30 IST

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం చిన్న సరిగెత్తు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది

వైభవంగా గూగూడు కుళ్లాయిస్వామి చిన్న సరిగెత్తు
గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో పీర్లు




నార్పల, ఆగస్టు 6: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం చిన్న సరిగెత్తు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున కుళ్లాయిస్వామిని వెండి, బంగారు ఆభరణాలు, పలు రకాల పూలతో అలంకరించారు. వేలాది మంది భక్తులు గూగూడుకు విచ్చేసి స్వామికి చక్కెర చదివింపులు, ఫాతేహాలు చేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో టెంకాయలు, పూలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అగ్ని గుండంలో మొద్దులు వేసి మొక్కులు తీర్చుకున్నారు. రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు జరగకపోవడంతో ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు కుళ్లాయిస్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయం బయటి నుంచి స్వామిని  దర్శించుకోవడం వల్ల భక్తులను అదుపు చేయడం  పోలీసులకు తలనొప్పిగా మారింది. జంట ఆల యాలను విద్యుత దీపాలతో అలంకరించారు. ఈ నెల 8న పెద్ద సరిగెత్తు, 9న జలధి, 11న స్వామి చివరి దర్శనం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి శోభ తెలిపారు.


Updated Date - 2022-08-07T05:18:55+05:30 IST