గృహ నిర్మాణదారులకు బిల్లులు ఇవ్వాలి : అంగర

ABN , First Publish Date - 2020-12-04T04:49:45+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

గృహ నిర్మాణదారులకు బిల్లులు ఇవ్వాలి : అంగర

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 3 : గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలాల్లో గృహాలు నిర్మించుకున్న వారికి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్సీ  అంగర రామ్మోహన్‌ ప్రభుత్వాన్ని కోరారు. శానన మండలిలో స్వల్పకాలిక చర్చలో గురువారం ఆయన మాట్లాడారు. ఈ విషయాన్ని ఫోన్‌లో ఆంధ్ర జ్యోతికి తెలిపారు.ఆక్వా సౌకర్యార్థం శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని కోరారు. రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని కోరినట్టు తెలిపారు.

Updated Date - 2020-12-04T04:49:45+05:30 IST