పెండింగ్‌ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-07T04:55:32+05:30 IST

పెండింగ్‌ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.

పెండింగ్‌ రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి
రోటరీనగర్‌ పాఠశాలలో విద్యార్థితో మాట్లాడుతున్న కలెక్టర్‌


తహసీల్దార్లతో  కలెక్టర్‌ గౌతమ్‌ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌, జూలై6: పెండింగ్‌ రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ సదస్సులు   ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులకు సిద్దంగా ఉండాలని పెండింగ్‌ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఎల్‌ఆర్‌ యూపీ , రెవెన్యూ సదస్సులు గతంలో చేశారని దీనిపై అదికారులకు అవగాహన ఉందన్నారు. సాధాబైనామా ఖాతాల పెండింగ్‌ వివరాలు అందించాలన్నారు.  గ్రామాల వారీగా నాలా రిపోర్ట్‌ ను గ్రామం మెత్తంగా ఉన్న భూమి వ్యవసాయ భూమి ప్రజల అవసరార్థం ఎంత ఉందీ వివరాలు రికార్డ్‌ ప్రకారంగా పరిశీలన చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.  ఈ సమీక్షంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, డీఆర్వో ఆర్‌ శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్‌, సూర్యనా రాయణ, కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌,  తహసీల్దార్లు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయండి

ఖమ్మంఖానాపురంహవేలి: మనఊరు మనబడి, మనబస్తీ- మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులకు సూచించారు. బుధవారం నగరంలోని పాండురంగాపురం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, మండలపరిషత్‌ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీచేశారు. రోటరీనగర్‌లోనిజిల్లాపరిషత్‌, ప్రాధమిక పాఠశాలలను తనిఖీచేశారు. అనంతరం 7వతరగతి విద్యార్ధులతో మాట్లాడారు. ఎక్కువమంది విద్యార్ధులు ఆంగ్లమాధ్యమాన్ని ఎందుకు ఎంచుకోలేదని అడిగారు. ఇంగ్లీష్‌ అంటే భయం వద్దని ధైర్యం చెప్పి వెనుకబడిన విద్యార్ధుల పట్ల ప్రత్యేకశ్రద్ధ తీసుకుని ముందుకు తీసుకెళ్లాలని ఉపాధ్యా యులకు సూచించారు.  ఈనెల 15వతేదీ కల్లా ఒక జత యూనిఫాం, నెలాఖరుకల్లా మరో జత అందిస్తామని విద్యార్ధులకు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శసురభి, డీఈవో యాదయ్య, ఎంఈవో శ్రీనివాస్‌, ఎస్‌ఈ రంజిత్‌, డీఈలు రంగారావు, స్వరూపరాణి, పాఠశాల హెచ్‌ఎం మోతుకూరి మధు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బస్తీదవాఖానాలో అన్ని సదుపాయాలు ఉండాలి

ఖమ్మం కలెక్టరేట్‌: అన్ని సదుపాయాలతో బస్తీ దవాఖానాలను సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆదేశించారు., బుధవారం నగర  కమీషనర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి బస్తీ దవాఖానాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. పాండురంగాపురం, మేదరి బస్తీ పాకబండ బజార్లో ఏర్పాటు కానున్న బస్తీదవాఖానాలను పరిశీలించారు. పరీక్షలకు నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రానికి తరలించే ఏర్పాటు చేయాలని నివేదికలను కూడా ఇక్కడే పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  పాండురంగా పురం బస్తీ దవాఖానా ఈనెల 8న మేదరబస్తీ దవాఖానాని ఈనెల 20న ప్రారంభించడానికి సిద్దం చేయాలన్నారు. కలెక్టర్‌ పర్యటనలో కార్పోరేటర్‌ చంద్రకళ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి మాలతి, మునిసిపల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఈ రంజిత్‌, డీఈలు,  డాక్టర్‌ స్నిగ్ద  తదితరులు పాల్గొన్నారు. 

 దళిత బంధు యూనిట్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

జిల్లాలో దళితబంధు పథకం మంజూరి యూనిట్ల గ్రౌండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో  యూనిట్లపై గ్రౌండింగ్‌పై సమీక్షించారు. నిత్యం యూనిట్ల గ్రౌండింగ్‌పై వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాధ్‌, సూర్యనారాయణ, ఎస్డీసీ దశరథ్‌, వ్యవసాయశాఖ అధికారిణి విజయనిర్మల, పశుసంవర్థకశాఖ జేడీ డాక్టర్‌ వేణుమనోహర్‌, జడ్పీ సీఈవో వెంకట అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T04:55:32+05:30 IST