‘పెండింగ్‌ జీతాలు విడుదల చేయాలి’

ABN , First Publish Date - 2021-07-27T05:44:15+05:30 IST

సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వ సతి గృహాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 17 నెలలుగా జీతాలు లేవని వాటిని తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్య క్షుడు రేవు తిరుమలరావు డిమాండ్‌ చేశారు.

‘పెండింగ్‌  జీతాలు విడుదల చేయాలి’

రాజమహేంద్రవరం సిటీ, జూలై 26: సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వ సతి గృహాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు 17 నెలలుగా జీతాలు లేవని వాటిని తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్య క్షుడు రేవు తిరుమలరావు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్ట్స్‌ కళాశాల వసతి గృహం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020 జన వరిలో వికాస్‌ సంస్థ సాంఘిక సంక్షేమ శాఖల్లో జిల్లా వ్యాప్తంగా 120 మంది ని కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమించిందని అయితే కళాశాల హాస్టల్స్‌లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఒక్క నెల జీతం కూడా అందలేదని ఇది సంక్షేమ అధికారుల నిర్లక్ష్యమని ఆరోపించారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్‌ ఉద్యో గుల సంఘం నాయకులు కేవీరమణ, పరమట సింగ్‌, ఐఎఫ్‌టీయూ నాయ కులు ఏవీరమణ, కె. జోజి, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎస్‌.చిన్న, పి.సుజాత, జె. దేవకి, బి.మహేష్‌కుమార్‌, ఎం.గౌరీ శివపార్వతి, కె.శ్రీదేవి, పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:44:15+05:30 IST