పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-17T06:27:32+05:30 IST

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఆదేశించారు.

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి
సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి

- కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ ఆదేశించారు. బుధవారం పట్ట ణంలో నూతనంగా నిర్మాణమవుతున్న సమీకృత కలెక్టరే ట్‌ భవన సముదాయాన్ని ఆయన సందర్శించారు. చివ రి దశలో ఉన్న భవన నిర్మాణ పనులను, పట్టణ సుం దరీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు పలు ఆ దేశాలు జారీ చేశారు. సమీ కృత కలెక్టరేట్‌ భవనం ప్ర హరీ నాలుగు వైపులా మూడు వరసల్లో వివిధ రకాల మొక్కలు నాటాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో మి యావాకి పద్ధతిలో మొక్కలు నాటాలని తెలిపారు. నాటే మొక్కలు చిన్నవి కాకుండా పెద్ద మొక్కలను నా టేలా చూడాలని తెలిపారు. 

కార్యాలయానికి వచ్చే రహదారి మొదలుకొని మార్గంలో ఆకర్షణీయంగా ఉండేలా వివిధ పూల మొ క్కలను నాటాలన్నారు.  కార్యాలయానికి వచ్చే అధికా రులు, ఇతరుల వాహనాల పార్కింగ్‌లో ఇబ్బందులు త లెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మురుగు కాలు వ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాశ్వత ప్రతిపాదికన హెలిప్యాడ్‌ నిర్మాణం చేపట్టేలా చూ డాలని, కార్యాలయ భవనం ముందు, లోపల అనవసర నిర్మాణాలను తొలగించాని తెలిపారు. రోడ్డు నిర్మాణం స క్రమంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు.  కార్యక్ర మంలో జగిత్యాల ఆర్డీవో మాధురి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీనివాస్‌రావు, అటవీ శాఖాధికారి వెంకటేశ్వర్‌రా వు, మున్సిపల్‌ కమిషనర్‌ మారుతిప్రసాద్‌, తహసీల్దార్‌ వెం కటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T06:27:32+05:30 IST