సిద్దవటం, నవంబరు29 : సిద్దవటం ఎగువపేటకు చెందిన షేక్ మహమ్మద్ అలీ అనే వ్యక్తి ఆదివారం మద్యం మత్తులో పెన్నానదిలో దూకి గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. మహమ్మద్ అలీ ఆదివారం మధ్యాహ్నం పెన్నానది బ్రిడ్జిపై నుంచి దూకేందుకు ప్రయత్నించే సమయంలో అక్కడ ప్రజలు, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అతని తమ్ముడు మౌలాలికి అప్పగించారు. అయితే ఆ వ్యక్తి మళ్లీ మద్యం తాగి బ్రిడ్జిపై నుంచి దూకి వరద ఉధృతికి కొట్టుకోయాడు. గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.