కాలుష్యం కోరల్లో పెన్నా

ABN , First Publish Date - 2021-07-27T04:48:38+05:30 IST

ప్రొద్దుటూరు పట్టణం, పరిసర గ్రామాలతో పాటు ఎర్రగుంట్ల, పో ట్లదుర్తి గ్రామాలకు సైతం ఏకైక తాగునీటి వనరు పెన్నానది జలాలే. లక్షలాది మందికి తాగునీటి సదుపాయం కల్పిస్తున్న పెన్నానది నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది.

కాలుష్యం కోరల్లో పెన్నా
కలుషితమౌతున్న నదీ జలాలు

ప్రొద్దుటూరు అర్బన్‌, జూలై 26: ప్రొద్దుటూరు పట్టణం, పరిసర గ్రామాలతో పాటు ఎర్రగుంట్ల, పో ట్లదుర్తి గ్రామాలకు సైతం ఏకైక తాగునీటి వనరు పెన్నానది జలాలే. లక్షలాది మందికి తాగునీటి సదుపాయం కల్పిస్తున్న పెన్నానది నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. సోములవారిపల్లె పంచాయతీ తో పాటు మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది సైతం రోజు చెత్త వాహనాలను పెన్నానదిలోకి తెచ్చి వ్యర్థా లను వదులుతుండడంతోపాటు  ప్రైవేటు వ్యక్తులు రకరకాల వ్యర్థాలను తెచ్చి వేస్తుండడంతో  ప్లాస్టిక్‌, ఐరన్‌, ఇతర ప్రమాదకరమైన వ్యర్థాలు గుట్టలు గా పడివున్నాయి. మరికొందరు ఏకంగా చికెన్‌ సెం టర్లలోని కోడి ఈకలు ఇతర వ్యర్థాలను వదులుతు న్నారు. ఇందువల్ల పెన్నానది వద్దకు వెళితే భయం కరమైన దుర్గంధం వెదజల్లుతోంది. తాగునీటి జలా లతో కళకళలాడాల్సిన పెన్నమ్మ డంపింగ్‌ యార్డుగా మారిపోతోంది. దీంతో భారీస్థాయిలో  పందులు  చెత్త కుప్పలను కుళ్ళగిస్తూ భీభత్సం చేస్తున్నాయి. మరికొందరు జంతు కళేబరాలను వేస్తుండడంతో  నదీ పర్యావరణం  కలుషితమవుతోంది.

తాగునీటి వనరులకే దిక్కులేదు

మైలవరం నుంచి అప్పుడప్పుడు విడుదల అయ్యే నీటితో తాగునీటి వనరుగా ఉన్నా పెన్నానదిని కలు షితం కాకుండా   రక్షించాల్సిన అధికారులు, పాల కులు అటు వైపు దృష్టి సారించకపోవడం శోచనీ యం. ఈ పెన్నమ్మలో మున్సిపాలిటీకి చెందిన పె న్నా వాటర్‌ వర్క్స్‌ బోర్ల నుంచే ప్రొద్దుటూరు పట్ట ణంలోని సగం ప్రాంతానికి తాగునీరు అందుతోంది. అలాగే ఎర్రగుంట్ల రోడ్డులో పోట్లదుర్తి ఎర్రగుంట్లకు చెందిన తాగునీటి బోర్లు సైతం ఇక్కడ వున్నాయి. ఇలాంటి తాగునీటికి నిలయమైన పెన్నానది కాలు ష్య కోరల్లో చిక్కుకోవడంతోపాటు డంపింగ్‌ యార్డ్‌గా మారుతుండడం బాధాకరం. ప్రమాదకరమైన పదా ర్థాలు నీటిలో చేరి భూగర్భంలోకి వెళ్లే ప్రమాదంలేక పోలేదని దీనికితోడు తాగునీటి బోర్లలో నీరు కలుషి తమైతే ప్రమాదకర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని  పలువురు ఆందోళన వ్యక్తంచేస్తు న్నారు.

ప్రకృతి వనరులను సంరక్షించాలి

ప్రకృతివనరులైన నదులు, చెరువు, అడవులను పరి రక్షించాల్సిన బాధ్యత అధికారులు. పాలకులపై ఎం తో ఉంది. ముఖ్యంగా జల కాలుష్యంతో అంటు వ్యాఽ దులు ప్రబలితే అందుకు బాధ్యత ఎవరు వహి స్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.   నీటి కాలుష్యంతో ప్రజలు నష్టపోవక ముందు అధికారు లు మేల్కోవ డం ఎంతైనా అవసరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం భారీన పడుతున్న పెన్నానదిని రెవెన్యూ, ఇరిగేషన్‌ మైనింగ్‌, మున్సి పల్‌, పంచాయతీ అధికారులు స్పందించి  తక్షణం కాపాడడంతోపాటు ప్రజలకు స్వచ్ఛమైన నీరు అం దించాలని  కోరుతున్నారు. 



Updated Date - 2021-07-27T04:48:38+05:30 IST