బైడెన్ విజయాన్ని అధికారికంగా ధృవీకరించిన పెన్సిల్వేనియా !

ABN , First Publish Date - 2020-11-25T20:37:41+05:30 IST

పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయానికి అధికారక గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ టామ్ వొల్ఫ్(డెమొక్రట్) మంగళవారం ఒక ట్వీట్ చేశారు.

బైడెన్ విజయాన్ని అధికారికంగా ధృవీకరించిన పెన్సిల్వేనియా !

వాషింగ్టన్: పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయానికి అధికారక గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర గవర్నర్ టామ్ వొల్ఫ్(డెమొక్రట్) మంగళవారం ఒక ట్వీట్ చేశారు. "నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో భాగంగా పెన్సిల్వేనియాలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థులైన జో బైడెన్, కమలా హ్యారిస్ విజయం సాధించారు. బైడెన్, కమలా విజయానికి పెన్సిల్వేనియా స్టేట్ డిపార్ట్‌మెంట్ మంగళవారం అధికారిక గుర్తింపునిచ్చింది." అని టామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ విజయంతో పెన్సిల్వేనియా రాష్ట్రంలోని 20 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో చేరాయని గవర్నర్ తెలిపారు. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌లో అవకతవకలు జరిగాయని న్యాయస్థానాన్ని ఆశ్రయించి విఫలమైన సంగతి తెలిసిందే.     

Updated Date - 2020-11-25T20:37:41+05:30 IST