ఆ పార్కులో అడుగుపెడితే షాకవ్వాల్సిందే.. అతిపెద్ద బంగారు క్యూబ్‌ను చూసి తీరాల్సిందే..

ABN , First Publish Date - 2022-02-05T02:08:05+05:30 IST

కొన్ని పార్కులకు వెళ్లినప్పుడు తిరిగి బయటికి వెళ్లాలంటే బుద్ధి పుట్టదు. అక్కడే ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. న్యాయార్క్‌లోని ఓ పార్కు కూడా ఈ కోవకే చెందుతుంది. ఆ పార్కులోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యి తీరాల్సిందే...

ఆ పార్కులో అడుగుపెడితే షాకవ్వాల్సిందే.. అతిపెద్ద బంగారు క్యూబ్‌ను చూసి తీరాల్సిందే..

ప్రశాంతత కోసం చాలా మంది సరదాగా పార్కులకు వెళ్లి సేదతీరుతుంటారు. పెద్దలు, చిన్నపిల్లలకు ఆటవిడుపుగా ఉండేందుకు పార్కుల నిర్వాహకులు కూడా వివిధ ఏర్పాట్లు చేస్తుంటారు. కొన్ని పార్కులకు వెళ్లినప్పుడు తిరిగి బయటికి వెళ్లాలంటే బుద్ధి పుట్టదు. అక్కడే ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. న్యాయార్క్‌లోని ఓ పార్కు కూడా ఈ కోవకే చెందుతుంది. ఆ పార్కులోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యి తీరాల్సిందే. లోపలికి వెళ్లిన వారంతా అక్కడున్న.. అతిపెద్ద బంగారు క్యూబ్‌ను చూసి సంబ్రమాశ్చర్యానికి లోనవుతున్నారు.


బంగారుతో చేసిన ఎన్నో రకాల వస్తువులను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ అదే బంగారంతో చేసిన, అతిపెద్ద క్యూబ్‌ను మాత్రం ఎక్కడా చూసుండరు. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో ఈ క్యూబ్‌ను చూడొచ్చు. 186కిలోగ్రాముల 24 క్యారెట్ గోల్డ్‌తో.. జర్మన్ కళాకారుడు నిక్లాస్ కాస్టెల్లో, ఈ క్యూబ్‌ను రూపొందించాడు. క్యూబ్‌కు విస్తృత ప్రచారం చేయాలనే ఉద్దేశంతో పార్కులో ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఈ క్యూబ్ అతి పెద్దదిగా చెబుతున్నారు.

ఖడ్గమృగాన్నే ముద్దు పెట్టుకున్న యువతి.. వామ్మో! ఈ యువతికి ఎంత ధైర్యమో..


అయితే ఈ క్యూబ్‌ని అమ్మకానికి పెట్టడం లేదని కళాకారుడు కాస్టెల్లో తెలిపాడు. ఈ గోల్డ్‌ క్యూబ్‌ సుమారు 11.7మిలియన్ డాలర్లు (రూ.87.49 కోట్లు)విలువ చేస్తుందట. దీనిని పాతతరం కొలిమితో మాత్రమే తయారు చేయగలమని కళాకారుడు చెబుతున్నాడు. ఈ భౌతిక కళాకృతి పేరున ఓ క్రిప్టోకరెన్సీ కాయిన్‌ని ప్రారంభించడమే కాకుండా.. ఎన్‌ఎఫ్‌టీల్లో వేలం వేయనున్నట్లు కళాకారుడు తెలిపాడు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఈ క్యూబ్ హాట్‌టాపిక్‌గా మారింది. దీన్ని చూసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారట.

భార్య ప్రేమతో అడిగిందని బైక్‌లో బయటికి తీసుకెళ్లాడు.. ఉన్నట్టుండి మధ్యలో బండికి పంక్చర్.. అంతలోనే..





Updated Date - 2022-02-05T02:08:05+05:30 IST