Vegetable sales: ఛీ ఛీ ఇలాంటి వ్యాపారులను ఏమనాలి.. రోజూ కూరగాయలపై మూత్రం పోసి మరీ.. ఇతను చేసిన పని..

ABN , First Publish Date - 2022-09-17T21:53:46+05:30 IST

కొందరు చిన్న చిన్న వ్యాపారుల అనైతిక చర్యలు.. అప్పుడప్పుడూ తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయి. పానీపూరీ విక్రయించే వ్యాపారులు.. అందులో మురుగు నీటిని కలపడం...

Vegetable sales: ఛీ ఛీ ఇలాంటి వ్యాపారులను ఏమనాలి.. రోజూ కూరగాయలపై మూత్రం పోసి మరీ.. ఇతను చేసిన పని..

కొందరు చిన్న చిన్న వ్యాపారుల అనైతిక చర్యలు.. అప్పుడప్పుడూ తీవ్ర చర్చనీయాంశం అవుతుంటాయి. పానీపూరీ విక్రయించే వ్యాపారులు.. అందులో మురుగు నీటిని కలపడం, హోటళ్లలో తినుబండారాలపై ఉమ్మి, చెమట వేయడం, వంట చేసే క్రమంలో శుభ్రత పాటించకపోవడం.. తదితర ఘటనలు అప్పుడప్పుడూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఓ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యాపారి కూరగాయలపై మూత్రం పోసి విక్రయించడం.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలీ పరిధి జనక్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉంటున్న షరీప్‌ఖాన్‌ కూరగాయల వ్యాపారం (Vegetable business) చేస్తుంటాడు. గత 30ఏళ్లుగా ఇతను ఇదే పని చేస్తున్నాడు. ఎప్పుడూ ఇతడిపై ఎలాంటి ఫిర్యాదూ లేదు. అయితే ప్రస్తుతం ఇతడిని చూస్తేనే స్థానికులు మండిపడుతున్నారు. జనక్‌పురి, ప్రేమ్‌నగర్ తదితర ప్రాంతాల్లో షరీప్‌ఖాన్‌ ఎక్కువగా కూరగాయలను విక్రయిస్తుంటాడు. ఇదిలావుండగా, జనక్‌పురిలో శుక్రవారం జరిగిన ఘటనతో స్థానికులంతా మండిపడుతున్నారు. ఉదయాన్నే కూరగాయలు విక్రయిస్తున్న షరీప్‌ఖాన్‌.. నిర్మానుష్య ప్రదేశంలో వాటిపై మూత్రం పోసిన అనంతరం వాటిని విక్రయించడం మొదలెట్టాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇదంతా గమనించి స్థానికులకు తెలియజేశాడు.

షాకింగ్ ఘటన.. కూతురి మృతదేహాన్ని ఉప్పుతో పూడ్చేసిన తండ్రి.. 44 రోజుల తర్వాత బయటకు తవ్వి తీసి..


అనంతరం అంతా కలిసి ప్రేమ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా చివరకు తప్పును ఒప్పుకొన్నాడు. ‘‘నేను తప్పు చేశాను.. నన్ను క్షమించండి.. ఇక మీద ఇలాంటి తప్పు చేయను’’.. అంటూ వేడుకున్నాడు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువులంటే నచ్చకే ఇలాంటి పని చేశాడని.. సంబంధిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. విక్రయదారులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి, బండిపై వారి పేరు తదితర వివరాలు రాయించాలంటూ డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

పొరపాటున ఖాతాలోకి రూ.11 వేల కోట్లు.. కొద్ది గంటల్లోనే మాయం.. కానీ అతడు తెలివిగా చేసిన ఒక్క పనితో రూ.5 లక్షల లాభం..!





Updated Date - 2022-09-17T21:53:46+05:30 IST