జగన్‌ అసమర్థతతో జనం ఇక్కట్లు

ABN , First Publish Date - 2022-05-16T06:25:05+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన అసమర్థ పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.

జగన్‌ అసమర్థతతో జనం ఇక్కట్లు
షాబాదలో లాంతర్ల ప్రదర్శనలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా, గంధం సుబ్బారావు, మాధవరావు తదితరులు

జక్కంపూడి - షాబాద ‘బాదుడే బాదుడు’లో  దేవినేని ఉమా

విజయవాడ రూరల్‌, మే 15 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన అసమర్థ పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతుంటే, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచి, పుండు మీద కారం చల్లారన్నారు. విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి, షాబాదలో బాదుడే బాదుడు కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో లాంతర్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉమా మాట్లాడుతూ, వైసీపీ పాలనలో వారం వారం బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతోందన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉండగా, రెండు మూడు గంటలు కూడా ఇవ్వడంలేదన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు విజయవాడ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి రంగినేని నరేంద్ర, నాయకులు వడ్లమూడి చలపతిరావు, షేక్‌ కరీముల్లా, గూడపాటి పద్మశేఖర్‌, గంధం సుబ్బారావు, గర్నిపూడి మాధవరావు, పసుపులేటి జమలయ్య, వేముల మధుసూదనరావు, మేడూరి నరేంద్ర, రాయుడు శ్రీనివాసరావు, బొర్రా పున్నారావు, ధూళిపాళ్ల రమేష్‌ పాల్గొన్నారు. 


 మోగులూరులో..

కంచికచర్ల రూరల్‌:  మోగులూరులో ఆదివారం బాదుడే - బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కోగంటి బాబు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ మూడేళ్ల పాలన పూర్తిగా విఫలమైందన్నారు.  నాయకులు వెలగా తిరుపతిరావు, వెలగ నరసింహారావు, వెంకయ్య నాయుడు, గద్దె చిన్న, వెలగా రామకృష్ణ, పాల్గొన్నారు. 


టీడీపీ సభ్యత్వ నమోదు

కొండపల్లి(ఇబ్రహీంపట్నం) :  తెలుగు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు తెలుగుదేశం నాంది పలికిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండపల్లి 10వ డివిజన్‌ కౌన్సిలర్‌ కరిమికొండ శ్రీలక్ష్మీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 27, 28 తేదిలలో జరిగే టీడీపీ పసుపు పండుగ మహానాడు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అందరూ భాగస్వాములు కావాలన్నారు.  కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చుట్టుకుదురు శ్రీనివాసరావు, ముప్పసాని భూలక్ష్మీ, జల్లి జ్యోతి, పులి అరుణకుమారి, టీఎన్‌టీయూసీ నాయకులు పర్వతనేని సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు. మూలపాడులో జిల్లా తెలుగు యువత కార్యదర్శి గరికపాటి శివ ఆధ్వర్యంలో  సభ్యత్వ నమోదు కార్యక్రమంలో  కాకి నాగరాజు, గంజి నరసింహరావు, గరికపాటి శ్రీనివాసరావు, గొరిజాల సాంబశివరావు, మూరకొండ నాగేశ్వరరావు, జె.నాగలక్ష్మి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-16T06:25:05+05:30 IST