టీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మరు

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

టీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మరు

టీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మరు
మాట్లాడుతున్న ఆచారి

ఆమనగల్లు/షాద్‌నగర్‌ రూరల్‌/ఇబ్రహీంపట్నం/మొయినాబాద్‌, జూన్‌ 27:  టీఆర్‌ఎ్‌సను ప్రజలు నమ్మేస్థితిలో లేరని ఇక ఆసర్కార్‌ ఎంతోకాలం మనలేదని ఎన్‌బీసీ మాజీ సభ్యు డు తల్లోజు ఆచారి అన్నారు. పట్టణంలోని అయ్యప్ప కొండ ఆవరణలో సోమవారం కల్వకుర్తి నియోజకవర్గ బీజేవైఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్‌ పద్మ అనిల్‌ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆచారితో పాటు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యాదీశ్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కండె హరిప్రసాద్‌లు ముఖ్యఅతిఽథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో జూలై 3న హైదరాబాద్‌లో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు, పార్టీ బలోపేతంపై చర్చించారు. కార్యక్రమంలో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిలు శేఖర్‌రెడ్డి, గోటి నర్సింహ, బ్రహ్మచారి, రవి,  సంతో్‌షయాదవ్‌, నీలకంఠ పాండు, కండె సాయి, శ్రీశైలం, పర్వతాలు, జిల్లా ప్రభాకర్‌, మహేశ్‌, శ్రీనివాస్‌, పల్లె రాజుగౌడ్‌, శ్రీకాంత్‌, బిక్షపతి, జలగం రవి, కుమార్‌, ప్రవీణ్‌, పరుశరామ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా  ఫరూఖ్‌నగర్‌ మండలం దేవునిపల్లిలో సోమవారం కార్యకర్తలతో 3న జరిగే మోదీసభకు సంబంధించి సమాయత్త సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటే్‌షగుప్త, సీనియర్‌ నాయకులు అందె బాబయ్య మాట్లాడుతూ.. మోదీ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో దొడల వెంకటేష్‌, భరత్‌కుమార్‌, సుమన్‌గౌడ్‌, రవి, యాదయ్య, శ్రీను, సంతోష్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఇబ్రహీంపట్నం ఇన్‌చార్జి డా.కె.ప్రకా్‌షరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పోరెడ్డి అర్జున్‌రెడ్డిలు  బీజేపీ ముఖ్య కార్యకర్త్తలతో సమావేశమై మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాష, ప్రతాప్‌, లచ్చిరెడ్డి, అశోక్‌గౌడ్‌, అంజయ్యయాదవ్‌, దండె శ్రీశైలం యాదవ్‌ పాల్గొన్నారు.  అదేవిధంగా పార్టీ మొయినాబాద్‌ మండల అధ్యక్షుడు ఎం. మధుసూదన్‌రెడ్డి మండలంలోని కనకమామిడి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి 15వేల మంది పార్టీ కార్యకర్తలను తరలించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహారెడ్డి, నాయకులు పద్మనాభం, శ్రీనివా్‌సగౌడ్‌, ప్రభాకర్‌, సీతారాంరెడ్డి, లక్ష్మీపతి, శ్రీకాంత్‌, అశోక్‌, శివకుమార్‌, రాంరెడ్డి, రవీందర్‌, వెంకటేశ్‌గౌడ్‌ ఉన్నారు. 

Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST