ప్రజలు తీర్పు ఇచ్చారు. ఫలితాలు లాంఛనమే: తేజస్వీ

ABN , First Publish Date - 2022-03-08T22:07:50+05:30 IST

ఇక మిగిలిన రాష్ట్రాల్లో సైతం బీజేపీకి పరాభవం తప్పదని అన్న ఆయన.. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఆ పోటీలో బీజేపీ లేదని అన్నారు. అయితే ఎన్నికల్లో బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని విపక్షాలు..

ప్రజలు తీర్పు ఇచ్చారు. ఫలితాలు లాంఛనమే: తేజస్వీ

లఖ్‌నవూ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడా గెలవబోదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. ప్రజలు ఇప్పటికే ఈ తీర్పు ఇచ్చేశారని, ఫలితాలు లాంఛనమేనని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రజలు వీడ్కోలు చెప్పనున్నారన్న ఆయన.. యోగి ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారని, అది ఎన్నికల సమయంలో కనిపించదని అన్నారు. మార్చి 10న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయ ఢంకా మోగించి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తేజస్వీ అన్నారు.


ఇక మిగిలిన రాష్ట్రాల్లో సైతం బీజేపీకి పరాభవం తప్పదని అన్న ఆయన.. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఆ పోటీలో బీజేపీ లేదని అన్నారు. అయితే ఎన్నికల్లో బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తేజస్వీ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఎన్నికల పూర్తి ఫలితాలు విడుదలయ్యే ఆఖరి నిమిషం వరకు కన్నేసి ఉంచాలని అన్నారు.

Updated Date - 2022-03-08T22:07:50+05:30 IST