ప్రజలకు స్వాతంత్య్రం లేదు

ABN , First Publish Date - 2022-08-12T05:43:53+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజలకు స్వాతంత్య్రం లేదని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు.

ప్రజలకు స్వాతంత్య్రం లేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సంపత్‌కుమార్‌

- ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌

- కొనసాగుతున్న ఆజాదీకా గౌరవ్‌ యాత్ర

ఎర్రవల్లి చౌరస్తా, ఆగస్టు 11 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో ప్రజలకు స్వాతంత్య్రం లేదని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. అజాదీకా గౌరవ పాదయాత్ర గురువారం మూడో రోజు ఇటిక్యాల మండలంలోని వీరాపురం నుంచి ప్రారంభమైంది. దువాసిపల్లి, వెంగన్నపల్లి, ధర్మవరం, వేముల గ్రామాల్లో కొనసాగింది. దువాసిపల్లి గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


జాతీయ జెండాను పట్టుకునే హక్కు లేదు

టీఅర్‌ఎస్‌, బీజేపీ నాయకులకు జాతీయ జెండాను పట్టుకునే హక్కు లేదని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ మండిపడ్డారు. అజాదీకా గౌరవ్‌ పాదయాత్రలో భాగంగా వేముల స్టేజీ దగ్గర ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అయన మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబపాలన, దేశంలో అవినీతి పాలన కొనసా గుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా వేముల మాజీ సర్పంచ్‌ లక్ష్మన్న టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. సంపత్‌కుమార్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, అసెంబ్లీ సమన్వయకర్త లక్ష్మీనారాయణరెడ్డి, మానవపాడు ఎంపీపీ అశోక్‌రెడ్డి,  ఎర్రవల్లి సర్పంచ్‌ రవి, వీరాపురం సర్పంచ్‌ రాముడు, నాయకులు రవిప్రకాశ్‌, వేముల మహేష్‌, మద్దిలేటి, సంధ్య బాబు, కుమార్‌, అడ్డాకుల రాము పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:43:53+05:30 IST