అమెరికాకు పెరుగుతున్న ‘వ్యాక్సినేషన్ టూర్స్’

Jun 21 2021 @ 23:31PM

వాషింగ్టన్: ప్రపంచంలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా తొలి స్థానంలో ఉంది. అమెరికా స్వతంత్ర దినోత్సవం జూలై 4 నాటికి దేశంలోని పెద్ద వాళ్లందరికీ కరోనా వ్యాక్సిన్ అందివ్వాలని ఆ దేశాధ్యక్షుడు జోబైడెన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో వేగంగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ చాలా మందకొడిగా సాగుతోంది. ఆయా దేశాల్లో వ్యాక్సిన్లు సరిగా అందుబాటులో కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా, థాయ్‌‌ల్యాండ్ వంటి దేశాలకు చెందిన సంపన్నులు వ్యాక్సినేషన్ కోసమే అమెరికా ప్రయాణమవుతున్నారు. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు కూడా ‘వ్యాక్సినేషన్ టూర్స్’ అంటూ ప్యాకేజీలు ఇస్తుండటం గమనార్హం.

Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.