ప్రజాసేవే జనసేన పార్టీ ధ్యేయం

ABN , First Publish Date - 2021-10-18T05:56:35+05:30 IST

కులాలన్నింటినీ కలిపే రాజకీయం జనసేన చేస్తుందని, రాజకీయ ప్రక్షాళన కోసమే జనసేన పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు.

ప్రజాసేవే జనసేన పార్టీ  ధ్యేయం

ముమ్మిడివరం, అక్టోబరు 17: కులాలన్నింటినీ కలిపే రాజకీయం జనసేన చేస్తుందని, రాజకీయ ప్రక్షాళన కోసమే జనసేన పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ జిల్లా అధ్య క్షుడు కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు.  ముమ్మిడివరం నగర పంచాయతీ క్రాపచింతలపూడిలో ఆదివారం జరి గిన శ్రమదానం తదితర  కార్యక్రమాల్లో దుర్గేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా నియోజక వర్గ ఇన్‌చార్జి పితాని బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో దుర్గేష్‌  మాట్లాడారు. జనసేన పార్టీ  ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదా రులు అధ్వానంగా మారి ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారం, నిధులుండి కూడా వైసీపీ ప్రభుత్వం చేపట్టలేని రోడ్ల మరమ్మతు పనులు జనసేన పార్టీ చేపట్టిందన్నారు. ముమ్మిడివరం-ముక్తేశ్వరం ఆర్‌ అండ్‌బీ రోడ్డులో క్రాపచింతలపూడి  పరిధిలో పడిన భారీ గుంతలను, క్రాపచింతలపూడి-పళ్లవారిపాలెం రోడ్డులో గుంతలను శ్రమదానం చేసి పూడ్చారు. పార్టీ క్రీయాశీలక సభ్యత్వాలు తీసుకున్న కార్యకర్తలకు కిట్లు పంపిణీ చేశారు. తొలుత  గ్రామంలో నిర్మించిన పార్టీ స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు.  డీఎంఆర్‌ శేఖర్‌, సానబోయిన మల్లికార్జునరావు, గోదశి పుండరీష్‌, గుద్దటి జమి, యేడిద శ్రీను, జక్కంపూడి పండు, నూకల దుర్గ, దూడల స్వామి, ముత్యాల జయలక్ష్మి, గిడ్డి రత్నశ్రీ, యలమంచిలి బాలరాజు, మాదాల శ్రీను  తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామంలో టీడీపీ, వైసీపీలకు చెందిన పలువురు జనసేన పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి  ఆహ్వానించారు. 



Updated Date - 2021-10-18T05:56:35+05:30 IST