బొద్దింకలతో బీరు తయారీ.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న వైనం.. ఇంతకీ అదెక్కడంటే..

ABN , First Publish Date - 2021-12-12T03:11:59+05:30 IST

బీరును బొద్దింకలతో తయారు చేయొచ్చని వారు నిరూపించారు. ఈ బీరు రుచి చూసిన వారంతా వావ్.. సూపర్‌గా ఉందంటూ..లొట్టలేసుకుంటూ తాగుతున్నారట..

బొద్దింకలతో బీరు తయారీ.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న వైనం.. ఇంతకీ అదెక్కడంటే..

పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు.. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి. కొందరికి మాంసాహారం ఇష్టమైతే, ఇంకొందరికి శాఖాహారం ఇష్టం. కొన్ని ప్రాంతాల్లో భోజన ప్రియుల అభిరుచులు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం కలలో కూడా ఊహించని జంతువులు, కీటకాలను వారు లొట్టలేసుకుంటూ తింటూ ఉంటారు. అలాంటి వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం కూడా ఇలాంటి కోవకే చెందుతుంది. బీరును బొద్దింకలతో తయారు చేయొచ్చని వారు నిరూపించారు. ఈ బీరు రుచి చూసిన వారంతా వావ్.. సూపర్‌గా ఉందంటూ.. లొట్టలేసుకుంటూ తాగుతున్నారట. ఆ దేశంలో బొద్దింకల బీరుకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందట. వివరాల్లోకి వెళితే..


వినడానికి వింతగా ఉన్న ఈ బొద్దింకల బీరును జపాన్‌లో తయారు చేస్తున్నారు. ఈ బొద్దింకలను అక్కడి భాషలో కొంచు సౌర్ అని పిలుస్తారు. సుమారు నాలుగు అంగుళాల పొడవు ఉండే ఈ కీటకాలు, చూడటానికి మన బొద్దింకల మాదిరే ఉన్నా.. ఇళ్లల్లో కాకుండా నీటిలో సంచరిస్తూ ఉంటాయి. అక్కడ దొరికే చిన్న చిన్న చేపలు, కీటకాలను తింటూ పెరుగుతాయట. ఈ బొద్దింక ఆ దేశంలో ఎంతో రుచికరమైనదిగా పేరుగాంచింది. ప్రత్యేకమైన లైటు వెలుతురు వేయడం ద్వారా వీటిని పట్టుకుంటూ ఉంటారు. అలా సేకరించిన బొద్దింకలను వేడి నీటిలో ఉడకబెట్టి, నాలుగు రోజుల పాటు కుళ్లబెడతారు.

ప్రెజర్ కుక్కర్‌ను ఇలాక్కూడా వాడతారా... Viral అవుతున్న వీడియో..


అనంతరం దీని రసం ద్వారా బీరు తయారు చేస్తారు. పులుపు, తీయదనంతో కూడిన ఈ బీరంటే అక్కడి వారు తెగ ఇష్టంగా తాగుతారట. కొన్ని కంపెనీలు సొంతంగా ఈ బొద్దింకలను పెంచి, బీరు తయారు చేస్తూ ఉంటాయి. ఈ బొద్దింకల్లో మగ పురుగులు చాలా తీయగా ఉంటాయట. రుచి, వాసన అచ్చు రొయ్యల్లా ఉంటుందని చెబుతున్నారు. బీరు తయారు చేయడమే కాకుండా వీటిని ఉడకబెట్టుకుని కూడా తింటూ ఉంటారట. కొన్ని హోటళ్లలో బొద్దింకల సూప్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇక బొద్దింకల బీరు ధర బాటిల్ రూ.450 అయినా డిమాండ్ మాత్రం తగ్గలేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరగతి గదిలో క్లాసు చెబుతున్న టీచర్.. వెనుక నుంచీ వెళ్లి విద్యార్థులు చేసిన పనికి అంతా షాక్.. చివరికి విషయం ఎంతవరకు వెళ్లిందంటే..

Updated Date - 2021-12-12T03:11:59+05:30 IST