కట్టడికి ప్రజలు సహకరించాలి

ABN , First Publish Date - 2021-05-07T06:31:32+05:30 IST

కరోనా సెకెండ్‌ వేవ్‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సత్యయేసుబాబు హెచ్చరించారు

కట్టడికి ప్రజలు సహకరించాలి

-అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తాం

-ఎస్పీ సత్యయేసుబాబు

ధర్మవరంఅర్బన, మే 6: కరోనా సెకెండ్‌ వేవ్‌ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ సత్యయేసుబాబు హెచ్చరించారు. గురువారం సాయంత్రం కళాజ్యోతి సర్కిల్‌లో కర్ఫ్యూను పరిశీలించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారు లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ... రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తోందన్నారు. కరోనాను అరిక ట్టడానికి ప్రభుత్వం మధ్యాహ్నం 12గంటల వరకే దుకాణాలను తెరవడానికి అనుమతి ఇచ్చిందన్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆ తరువాత దుకాణాలు, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిపివేయడం జరిగిందన్నారు. కేవలం వైద్యఆరోగ్యశాఖ, ట్రాన్సకో, మీడియా తదితర ఉద్యోగులకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. అది కూడా డ్యూటీ పాసులు చూపిస్తేనే 12గంటల తరువాత అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 100 వాహనాలను సీజ్‌ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అనవసరంగా ఎవరూరోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్‌ చేయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట డీఎస్పీ రమాకాంత తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-05-07T06:31:32+05:30 IST