ప్రజలకు సక్రమంగా సేవలందించాలి

ABN , First Publish Date - 2021-01-24T05:36:16+05:30 IST

ప్రభుత్వం మంజూరు చేసిన మినీ ట్రక్కుల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవల ందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణకిశోర్‌ అన్నారు.

ప్రజలకు సక్రమంగా సేవలందించాలి
మాట్లాడుతున్న జేసీ కృష్ణకిశోర్‌

జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణకిశోర్‌

గరుగుబిల్లి, జనవరి 23 : ప్రభుత్వం మంజూరు చేసిన మినీ ట్రక్కుల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవల ందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణకిశోర్‌ అన్నారు. శని వారం మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ట్రక్కు డ్రైవ ర్లు, వీఆర్‌వోలు, డీలర్లతో అవగాహన సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రక్కు లకు జీపీఎస్‌ అనుసంధానం చేయడం వల్ల ఏ ఇతర పను లకు వాహనాన్ని వినియోగించకూడదన్నారు. వీఆర్‌ వోల పర్యవేక్షణలో ఎలకా్ట్రనిక్‌ యంత్రాల సహాయంతో సరైన తూకంతో కార్డుదారులకు సరుకులను అందించాలన్నారు.  కార్యక్రమం విజయవంతానికి ట్రక్కు డ్రైవర్లతో డీలర్ల భాగస్వామ్యం ఎంతో అవసర మన్నారు. ఏ లోపం జరిగినా చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరిం చారు. తహ సీల్దార్‌ వీవీఎస్‌ శర్మ, డీఎస్‌వో పాపారావు, ఏఎస్‌వో లక్ష్మీనారాయణ, ఎంపీడీవో జి.చంద్రరావు, ఆర్‌ఐ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

సక్రమంగా రేషన్‌ పంపిణీ

రామభద్రపురం: ఇంటింటికీ రేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 నుం చి  సక్రమంగా సరుకులను పంపిణీ చేయాలని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ విదేఖర్‌ తెలిపారు. మండల రెవెన్యూ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రేషన్‌ డీలర్లు, వీఆర్వోలు, పంపిణీ వాహనదారులు కూడా బాధ్యత తీసుకుని ఇంటింటికీ వెళ్లి సరుకులు అందించాలని కోరారు. ఈపాస్‌ యంత్రాలు సరిగా ఉండేటట్టు చూసుకోవాలన్నారు. మండలానికి కేటాయించిన 9 వాహనాల ద్వారా బొబ్బిలి గోదాము నుంచి సరుకులు తెచ్చి డీలర్ల వద్ద నుంచి రోజుకి 90 మందికి అందించాలని తెలిపారు. తహసీల్దార్‌ పి.గణపతిరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-24T05:36:16+05:30 IST