ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-17T06:18:51+05:30 IST

ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. శుక్రవారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్‌లతో కరోనా ఉ

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కరోనాపై ఉమ్మడి జిల్లా కలెక్టర్‌లతో ఎమ్మెల్సీ కవిత సమీక్ష సమావేశం 

నేడు జిల్లాకు వెయ్యి డోస్‌ల రెమిడెసీవీఆర్‌ మందులు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి జిల్లా ప్రజలు కరోనాపట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. శుక్రవారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల కలెక్టర్‌లతో కరోనా ఉధృతిపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. వాటి తీవ్రత పొరుగున ఉన్న మన జిల్లాలకు తీవ్రంగా ఉందన్నారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండా లన్నారు. కరోనా రోగులకు అవసరమైన అన్ని వసతులను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆసుపత్రులు చికిత్స, కరోనా పరీక్షలు వంటి విషయాలపై కలెక్టర్‌లతో చర్చించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కరోనా రోగులకు ప్రత్యేక బెడ్‌లను అందుబాటులో ఉన్నాయన్నారు. నిజామాబాద్‌ ప్రైవేట్‌లో 1200, కామారెడ్డిలో 400 బెడ్‌లో అందుబాటులో ఉన్నాయ ని అధికారులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్‌లు, వెంటిలేటర్‌లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆసుపత్రిలో కరోనా పేషంట్‌లకు అవసరమైన తాగునీరు, ఆహారం, బెడ్స్‌, దుప్పట్లు, ఇతర సదుపాయాలు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలని అంబులెన్స్‌లు 24 గంటలు అందుబాటులో ఉంచాలన్నారు. శనివారం వెయ్యి డోస్‌ల రెమిడేసీవీఆర్‌ వ్యాక్సిన్‌ నిజామాబాద్‌ జిల్లాకు రానుందని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

Updated Date - 2021-04-17T06:18:51+05:30 IST