భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూలు, పాలు, నెయ్యి, నీరు, స్వీట్లను సమర్పిస్తారు. వివిధ దేవాలయాలలో వేర్వేరు ఆరాధనా విధానాలు ఉంటాయి. అయితే వీటన్నింటికీ భిన్నంగా నైవేద్యంగా భగవంతునికి బీడీలు సమర్పించే దేవాలయం మన దేశంలో ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం.
బీహార్లోని కైమూర్ జిల్లాలో ఒక దేవాలయం ఉంది. ఇక్కడ భక్తుల తమ కోరికలు నెరవేరేందుకు భగవంతుని బీడీలు సమర్పిస్తారు. ఆలయంలో కొలువైన బాబాకు బీడీలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా బాబా సంతోషిస్తాడని, భక్తుల కోర్కెలు తీరుస్తాడని స్థానికులు నమ్ముతారు. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వారంతా బీడీలు సమర్ఫించకుండా ముందుకు వెళ్లరు. ఈ పనిచేయకపోతే దురదృష్టం వెంటాడుతుందని చెబుతారు.