వర్షానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-07-24T06:01:11+05:30 IST

మండలంలో మూడు రోజులు గా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగ ర్‌రావులు అన్నారు.

వర్షానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
పాఠశాల గదులను పరిశీలిస్తున్న జెడ్పీచైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

ఫజడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 

మెట్‌పల్లి రూరల్‌, జూలై, 23 : మండలంలో మూడు రోజులు గా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగ ర్‌రావులు అన్నారు. శుక్రవారం మండలంలోని జగ్గాసాగర్‌ గ్రా మంలోని ప్రభుత్వ పాఠశాలలో కూలిపోయిన తరగతి గదులు, పీర్ల మసీదు, రహదారులతో పాటు గ్రామంలోని పలు వీధులను ఎంపీపీ మారు సాయిరెడ్డితో కలిసి పరిశీలించారు. పాఠశాల తరగతి గదుల పునరుద్ధరణకు జడ్పీ నిధుల నుంచి రూ.12లక్ష లు, పీర్ల మసీదు, గ్రామాభివృద్దికి కోసం రూ.5 లక్షలను ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని సమస్యలను ఎంపీపీ ఎమ్మెల్యే, జడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లగా ని ధులను మంజూరు చేసిన వారికి శాలువాతో సర్పంచ్‌ బద్దం సు గుణ-రాజేశ్‌లు ఘనంగా సన్మానించారు. రాజేశ్వర్‌రావుపేట లో కొట్టుకపో యి న రోడ్లను పరిశీలించి ఎస్సారెస్పీ, ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేసి ప్రాథమిక అంచనా విలువలను సేకరించాలని ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో స ర్పంచు శ్రీధర్‌, ఎంపీటీసీ గంగాధర్‌, నాయకులు జగన్‌గౌడ్‌, వెంకటేశ్‌, ఎంపీ డీవో బీమేశ్‌రెడ్డి, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్‌కుమార్‌, కారోబార్‌ మనోజ్‌, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు. 

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ఇబ్రహీంపట్నం : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపో యిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్ర వారం మండలంలోని ఎర్దండిలో గోదావరి ఉధృతిని పరిశీలించారు. రెండు రో జులుగా నియోజకవర్గంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి పరివహక గ్రామాలు జలమయం అయ్యాయని ప్రతి గ్రామాన్ని పరిశీలించి ఎ వరికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రా మాలకు కొంత మేర నీరు రావడంతో కొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలిం చినట్లు తెలిపారు. వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి కొంత మేర పంట నష్ట పరిహారం అందేలా ప్ర భుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాజల భీమేశ్వరి, సర్పంచ్‌ లక్షణ-గంగాధర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు దశరత్‌రెడ్డి, నాయకులు రాజన్న, సత్యనారాయణ, చిన్నారెడ్డి, సుమన్‌ ఉన్నారు. 

Updated Date - 2021-07-24T06:01:11+05:30 IST