టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి : సీతక్క

ABN , First Publish Date - 2022-09-28T06:49:44+05:30 IST

: టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రజలు గుణపాఠం చెప్పాలి : సీతక్క
బతుకమ్మ ఆడుతున్న సీతక్క

సంస్థాన్‌ నారాయణపురం, సెప్టెంబరు 27: టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో  భాగంగా సంస్థాన్‌ నారాయణపురం మండలం సర్వేల్‌ గ్రామంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారంరాత్రి నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ పాలనలో ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ గెలుపుతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. నిరంతరం పేదల కోసం పనిచేసే తనను ఆదరించి ఆశీర్వందించాలని పాల్వాయి స్రవంతి కోరారు. కార్యక్రమంలో పీసీసీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు, మాజీ మంత్రి బలరాంనాయక్‌, చల్లమల్ల కృష్ణారెడ్డి, బండ్రు శోభారాణి, వెనుముల శంకర్‌రెడ్డి, ఏపూరి సతీష్‌ పాల్గొన్నారు.

మునుగోడుపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం: స్రవంతి

చౌటుప్పల్‌ రూరల్‌: మునుగోడు గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌ మండలం జైకేసారం, తాళ్లసింగారం గ్రామాల్లో  ఆమె ఇంటింటికీ వెళ్లి  ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి చేసిన సేవలను గుర్తించి తనను గెలిపించాలని కోరారు. 90 వేల ఓట్లను 22వేల కోట్లకు రాజగోపాల్‌రెడ్డి అమ్ముకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు క్షమించరని అన్నారు.  కార్యక్రమంలో నాయకులు కొంపల్లి కార్పొరేటర్‌ జ్యోత్స్నరెడ్డి, ముప్పిడి సైదులుగౌడ్‌, అకుల ఇంద్రసేనారెడ్డి, సుర్వి నర్సింహగౌడ్‌, జీండ్రు అంజిరెడ్డి, నిమ్మల నాగరాజు, యమున పాల్గొన్నారు.




Updated Date - 2022-09-28T06:49:44+05:30 IST