నిద్ర లేటవుతోంది!

ABN , First Publish Date - 2020-04-23T17:48:01+05:30 IST

కరోనా జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగాలు ఆఫీసు నుంచి నట్టింటికే వచ్చి ఒకింత ఆనందం మిగిల్చాయి. అయితే వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతి మనదేశంలో

నిద్ర లేటవుతోంది!

ఆంధ్రజ్యోతి(23-04-2020)

కరోనా జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా ఉద్యోగాలు ఆఫీసు నుంచి నట్టింటికే వచ్చి ఒకింత ఆనందం మిగిల్చాయి. అయితే వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతి మనదేశంలో ఉద్యోగుల నిద్రపై దుష్ప్రభావం చూపుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న ఉద్యోగులపై ఇటీవల జరిపిన ఈ సర్వే ఏం చెప్పిందంటే.. 


ఆలస్యంగా నిద్రపోయేవారి సంఖ్యలో 40 శాతం పెరుగుదల నమోదైంది. 


67 శాతం ఉద్యోగుల్లో నిద్రవేళలు మారాయి.


లాక్‌డౌన్‌ నుంచి చాలామంది రాత్రి 11 తరువాతే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు వీరిలో 41 శాతం మంది రాత్రి 11 కంటే ముందే నిద్ర పోయేవారు. లాక్‌డౌన్‌ మొదలయ్యాక వీరి సంఖ్య 39 శాతానికి పడిపోయింది. 


రాత్రి 12 తరువాత నిద్రపోయేవారి శాతం 25 నుంచి 35కు పెరిగింది. 


ఉద్యోగ భద్రత, ఆర్థిక నిర్వహణ, కుటుంబ భద్రత గురించి ఆందోళనలాంటి పలు కారణాలు కొందరు ఉద్యోగుల్లో నిద్రలేని రాత్రులకు కారణమవుతున్నాయి. అయితే లాక్‌డౌన్‌ ఎత్తేసేనాటికి తమ నిద్రవేళలు మరింత మెరుగవుతాయి అని వారిలో 81 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నారు.

Updated Date - 2020-04-23T17:48:01+05:30 IST