అందినోళ్లకు అందినంత.. ప్రమాదానికి గురయిన Lorry.. ఆ తర్వాత జరిగిందిదీ..

Published: Fri, 27 May 2022 21:23:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అందినోళ్లకు అందినంత.. ప్రమాదానికి గురయిన Lorry.. ఆ తర్వాత జరిగిందిదీ..

బిలాస్‌పూర్ : ఏదైనా సరుకుతో ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడం.. కిందపడిపోయిన లోడ్‌ను జనాలు ఎగబడి మరీ ఎత్తుకెళ్లిన ఘటనలు అనేకం చూశాం. ఇదే తరహాలో మరో ఘటన చత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. శనగపప్పు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ వద్ద ప్రమాదానికి గురయింది. లారీ కిందపడ లేదు.. అందులోని సరుకు చెక్కుచెదరలేదు. కానీ సమీప ప్రాంత జనాలు లారీపై తండోపతండాలుగా ఎగబడ్డారు. లోడ్ విప్పుకుని మరీ శనగ పప్పు బస్తాలను యుద్ధప్రాతిపదికన మోసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ ఇంత ఆత్రుతా అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.