కవిటిలో ర్యాలీ నిర్వహిస్తున్న రామభక్తులు
కవిటి: అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం కవిటిలో అయోధ్య రామమందిర నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామభక్తులు ర్యాలీ చేపట్టారు. కార్యక్ర మంలో మాజీ సర్పంచ్ పి.శేఖర్, బి.సాగర్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బీజేపీ ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ సువ్వారు వెంకట సన్యాసిరావు ఆధ్వర్యంలో చిలకపాలెంలో శనివారం విరాళాలు సేకరించారు. బీజేపీ నేతలు వి.రఘురాం, మీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గార: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దీపావళి గ్రామంలో శనివారం విరాళాలు సేకరించారు. డీవీ రమణ, శ్రీరంగం మధుసూదనరావు, చింతు పాపారావు, పండి యోగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌లు చల్ల శ్రీనివాస్, శిమ్మ ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.
: