అలాంటి వాళ్లను దేశం నుంచి బహిష్కరిస్తాం.. బ్రిటన్ ప్రధాని హెచ్చరిక..

ABN , First Publish Date - 2022-04-15T01:35:51+05:30 IST

బ్రిటన్‌ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగ పరిస్తూ దేశంలోకి ప్రవేశించేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం హెచ్చరించారు.

అలాంటి వాళ్లను దేశం నుంచి బహిష్కరిస్తాం.. బ్రిటన్ ప్రధాని హెచ్చరిక..

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగ పరిచి దేశంలోకి ప్రవేశించేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం హెచ్చరించారు.  అటువంటి వారిని మరో దేశానికి  లేదా వాళ్ల సొంత దేశానికి పంపిచేస్తామని హెచ్చరించారు.‘‘ బ్రిటన్‌కు వలసొచ్చే వారు చట్టపరమైన మార్గాల్లోనే దేశంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలి.  తమకు కెటాయించిన సమయానికంటే ముందే దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించే వారు లేదా ఇక్కడి వ్యవస్థలను దుర్వినియోగ పరిచే వారు దేశంలో కొనసాగలేరు. వెను వెంటనే వారిని మరో దేశానికి లేదా.. తమ సొంత దేశాలకు పంపించేస్తాం’’ అని ఆయన హెచ్చరించారు. వలసలకు సంబంధించి రువాండా దేశంతో బ్రిటన్ కొత్తగా కుదుర్చున్న ఒప్పందం గురించి  వెల్లడించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-04-15T01:35:51+05:30 IST